వైరల్ : వరల్డ్ కప్ కదా.. ఆ మాత్రం సెలబ్రేషన్స్ ఉంటాయిలే?

praveen
ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా  టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ టి20 ప్రపంచకప్లో పదునైన వ్యాఖ్యలతో బరిలోకి దిగి టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయ్ అన్ని జట్లు. కానీ మొన్నటి వరకు జింబాబ్వే నెదర్లాండ్స్ జట్లు మాత్రం అటు టి 20 ప్రపంచకప్లో అర్హత సాధించడం కోసం హోరాహోరీ పోరాటం సాగించాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టకేలకు జింబాబ్వే ప్రపంచకప్కు క్వాలిఫై అయింది. అంతే కాదు నెదర్లాండ్స్ జట్టు కూడా ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం అర్హత సాధించింది అని చెప్పాలి.

 క్వాలిఫైయింగ్ టోర్నీలో భాగంగా ఈ రెండు జట్లు ఫైనల్ చేరాయి. ఈ క్రమంలోనే పాపువా న్యూ గినియా జట్టుపై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మరోవైపు నెదర్లాండ్స్ జట్టు యు ఎస్ ఎ జట్టుపై విజయం సాధించడం గమనార్హం. ఈ విషయాలతో రెండు జట్లు కూడా ప్రపంచ కప్కు అర్హత సాధించాయి. అయితే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన జింబాబ్వే జట్టు గత కొంతకాలంగా ఆటతీరు లో నాణ్యత లోపించడం కారణంగా వెనకబడిపోయింది. ఇక జింబాబ్వేలో క్రికెట్ కు పేరుప్రఖ్యాతలు పోవడానికి అక్కడ అంతర్గత వ్యవహారాల్లో విభేదాలు జాతివివక్ష లాంటి అంశాలు కూడా కారణమని చెప్పాలి.

 ఇక ఏది ఏమైనా ఎంతో కష్టపడి టి20  ప్రపంచకప్లో అర్హత సాధించింది జింబాబ్వే జట్టు. ఈ క్రమంలోనే ఇక అటు వరల్డ్ కప్లో చోటు దక్కడాన్ని ఏకంగా పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. మ్యాచ్ అనంతరం జింబాబ్వే ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో ఒక చోట చేరి తమ బ్యాట్ లను నేలకు కొడుతూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యాము అన్న విషయం తెలియగానే మా జట్టు సభ్యులు అందరూ పెద్ద పండగ చేసుకున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపింది జింబాబ్వే క్రికెట్. ప్రపంచ కప్కు అర్హత సాధించామంటే మాకు అది ఒక పెద్ద విషయం. మాటలు కూడా రావడం లేదు అంటూ ఆటగాళ్లు చెబుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: