కోచ్ ద్రావిడ్ ని చూస్తే బాధేస్తోంది : సౌరవ్ గంగూలీ

praveen
టీమిండియా హెడ్ కోచ్గా అటు రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిన వెంటనే టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను గంగూలీ హెడ్ కోచ్గా తీసుకువచ్చాడు. అయితే ఇలా ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా  తీసుకురావడానికి సౌరవ్ గంగూలీ ఎన్నో మంతనాలు జరిపాడు అనే చెప్పాలి. అయితే ఇక రాహుల్ ద్రావిడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి టీమిండియా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఒకవైపు యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూనే మరోవైపు సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన పై ఓ కన్నేసి ఉంచుతున్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. టీమిండియాను మరింత పటిష్టవంతంగా మార్చేందుకు జట్టు ప్రక్షాళన చేసేందుకు కూడా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

 కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రోత్సాహం అద్భుతం అంటూ అటు ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ని చూస్తే బాధనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించాడు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే సౌరవ్ గంగూలీ ఇలా అనడం  వెనుక ఒక పెద్ద కారణమే ఉంది.. కొంతకాలం నుంచి టీమిండియా బిజీ షెడ్యూల్ లో ఉంది.  ఒక పర్యటన ముగిసిన వెంటనే మరో పర్యటనకు బయలుదేరుతుంది. ఈ క్రమంలోనే జట్టులోని ఆటగాళ్లకు కెప్టెన్లకు సైతం విశ్రాంతిని ఇస్తూ జట్టులో అనూహ్యమైన మార్పులు చేస్తున్నారు సెలెక్టర్లు.

 కానీ అటు టీమిండియా వెళ్లే ప్రతి పర్యటనకు కూడా కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఆటగాళ్లకు విశ్రాంతి దొరుకుతుంది కానీ రాహుల్ ద్రవిడ్ మాత్రం విశ్రాంతి లేకుండా భారత జట్టు కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు. ఇక ఇటీవల ఇదే విషయంపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వక తప్పడంలేదు. కానీ అన్ని పర్యటనలకు అందుబాటులో ఉంటు విశ్రాంతి  లేకుండా పని చేస్తున్నా  కోచ్ రాహుల్ ద్రావిడ్ ను చూస్తేనే బాధిస్తోంది అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: