సంచలనం మిస్ అయింది... నాదల్ కు చెమటలు పట్టించిన కుర్రాడు !

VAMSI
గత నెల 20 నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా వింబుల్డన్ ఓపెన్ 2022 జరుగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఎన్నో సంచలనాలు నమోదు అయ్యాయి. అయితే మరో సంచలనం కొద్ది పాటిలో మిస్ అయింది. గత రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ లో భాగంగా వరల్డ్ నంబర్ 2 ర్యాంకర్ స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ మరియు అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్ లు తలపడ్డారు. మామూలుగా ఈ మ్యాచ్ కు ముందు వరకు టెన్నిస్ అభిమానులు ఖచ్చితంగా రఫెల్ నాదల్ గెలుస్తాడు. అయితే ఎంత ఘోరంగా టేలర్ ఫ్రిడ్జ్ ఓడిపోతాడు అన్నది మాత్రం ఆలోచించి ఉంటారు. అయితే ఫలితం మాత్రం మారకపోయినా .. ఆటతీరుతో మాత్రం అసాధారణ ప్రతిభను కనబరిచి ఒక దశలో నాదల్ కు ముచ్చెమటలు పట్టించాడు.
ఇక నాదల్ ఫ్యామిలీ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఇక నాదల్ కు ఓటమి తప్పదు అని డిసైడ్ అయి పోయి ఉంటారు. అంతలా టేలర్ తన పదునైన సర్వీస్ లు, బ్యాక్ హ్యాండ్ షాట్ లు, డ్రాప్ షాట్ లతో నాదల్ పై విరుచుకుపడ్డాడు. ఇందులో మొత్తం 5 సెట్స్ ఉంటాయి. ఇందులో బెస్ట్ ఎవరు విన్ అవుతారో వారు సెమీస్ కు అర్హత సాధిస్తారు. అనూహ్యంగా టేలర్ ఫ్రిడ్జ్ మొదటి సెట్ ను 6-3 తేడాతో గెలుచుకున్నాడు. దీనితో నాదల్ అభిమానగణం షాక్ అయ్యారు. రెండవ సెట్ ను పుంజుకున్న నాదల్ టై బ్రేక్ లో 5-7 తేడాతో గెలుపొందాడు. ఇక మూడవ సెట్ ను కూడా టేలర్ ఫ్రిడ్జ్ 6-3 తో గెలుచుకుని... సెట్ లలో 2-1 తో లీడ్ లోకు వెళ్ళిపోయాడు.  ఇక మిగిలిన రెండు సెట్ లలో టేలర్ ఫ్రిట్జ్ ఒకటి గెలిస్తే చాలు సంచలనం నమోదు అవుతుంది.
ఇలా జరగడానికి ఆ సమయంలో 90 శాతం పైగా అవకాశం ఉంది. కానీ ఎంతో అనుభవం కలిగిన పోరాటయోదుడు నాదల్ మాత్రం ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 4 మరియు 5 వ సెట్ లను 7-5, 7-6 తేడాతో వరుసగా గెలుచుకుని మ్యాచ్ ను కూడా టేలర్ ఫ్రిడ్జ్ నుండి లాగేసుకున్నాడు. అయితే నాదల్ గెలిచిన మూడు సెట్ లు కూడా టై బ్రేక్ కు వెళ్ళాయంటే.. టేలర్ ఎంత ఇబ్బంది పెట్టాడో అర్దం చేసుకోవచ్చు. అలా నాదల్ సెమీస్ కు దూసుకు వెళ్ళాడు. ఇక్కడ అమెరికాకు చెందిన మరో యువ సంచలనం నిక్ కిర్గియోస్ తో పోటీ పడనున్నాడు. కాగా మరి సెమీస్ లో వరల్డ్ నంబర్ వన్ నోవాక్ జోకోవిచ్, 9 వ సీడ్ నోరీతో తలపడనున్నాడు. ఈ రెండు మ్యాచ్ లలో ఖచ్చితంగా నాదల్ మరియు జోకొవిచ్ లు గెలిచి ఫైనల్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: