టీమిండియాలో గెలవాలన్న కసి కనిపించలేదు : ద్రావిడ్

praveen
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు అటు ఆతిథ్య ఇంగ్లండ్ తో ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్ ఆడింది. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడినా మ్యాచ్ రీషెడ్యూల్ చేయగా ఇక జులై 1వ తేదీ నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్టు మ్యాచ్ లో భాగంగా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచినట్లు  కనిపించింది. కానీ చివరికి మాత్రం  విజయం సాధించింది ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కావడం గమనార్హం.

 అటు బ్యాటింగ్ విభాగంలో మరోవైపు బౌలింగ్ విభాగంలో కూడా ఎంతో సమిష్టిగా రాణించిన టీమిండియా మొదటి మూడు రోజుల ఆట వరకు కూడా అటు ఇంగ్లాండ్ పైన ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు గానే కనిపించింది. కాని ఆ తర్వాత మాత్రం నాలుగో రోజు ఆటలో భారత బౌలింగ్ విభాగం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లను కట్టడి చేయడంలో విఫలం అయింది అని చెప్పాలి.  ఒకవైపు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో భారత బౌలర్లు మాత్రం వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ ముందుంచిన కొండంత లక్ష్యం చివరికి క్రమక్రమంగా కరుగుతూ వచ్చింది.

 చివరికి టీమిండియాకు ఓటమి తప్పలేదు.. సిరీస్ 2-2 తో సమం అయ్యింది. అయితే ఓటమిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మూడు రోజుల్లో టీమిండియా బాగా ఆడింది. కానీ నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సరిగ్గా ఆడలేకపోయింది. బ్యాటింగ్ లో బౌలింగ్ లో కూడా పూర్తిగా తేలిపోయింది. అంతేకాదు టీమిండియా గెలవాలి అన్న  కసి కొనసాగించలేక పోయింది. మధ్యలో రెండు మూడు అవకాశాలు వచ్చినా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అదే సమయంలో అటు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు జో రూట్,  బెయిర్ స్టో అద్భుతంగా ఆడారు అంటూ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: