పంత్ సెంచరీ.. కోచ్ ద్రావిడ్ షాకింగ్ రియాక్షన్?

praveen
రాహుల్ ద్రావిడ్.. ఈ పేరు చెబితే చాలు  కామ్ అండ్ కూల్గా ఉండే వ్యక్తి కళ్ళముందు తేలియాడుతూ ఉంటాడు. అందరూ ఎగిరి గంతేసే సందర్భాల్లో కూడా రాహుల్ ద్రవిడ్ మాత్రం చిన్న చిరునవ్వుతోనే సరిపెట్టుకుంటాడు.  ఇక తన ఆటతీరు లో మాత్రమే కాదు తనలో తాను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో కూడా దిట్ట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఆటగాడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ఇక ప్రస్తుతం కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా అతని తీరులో మార్పు రాలేదు. సాధారణంగా కోచ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తమ జట్టులోని ఆటగాడి వికెట్ తీసినప్పుడు లేదా సెంచరీ చేసినప్పుడు ఆనందంతో ఎగిరి గంతేయ్యటం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇక రాహుల్ ద్రవిడ్ నుంచి మాత్రం అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే ఆటగాళ్లకు నిరాశ తప్పదు. ఎందుకంటే  కీలక సమయంలో ఆటగాడు వికెట్ పడగొట్టిన రాహుల్ ద్రవిడ్ ముఖంలో చిన్న చిరునవ్వు తప్ప పెద్దగా ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు సౌరవ్ గంగూలీ లాగ షర్ట్ విప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా.. ఇక అగ్రెసివ్ కోహ్లీ గట్టిగా అరచి నట్లుగా సెలబ్రేషన్స్ అసలే కనిపించవు అని చెప్పాలి. కానీ ఇంగ్లాండ్తో  జరుగుతున్న టెస్టు సమయంలో మాత్రం ఎగిరి గంతేసాడు రాహుల్ ద్రావిడ్. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారి పోవడం తో ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

 టెస్ట్ మ్యాచ్లో భాగంగా 98 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రిషబ్ పంత్. 107 బంతుల్లో 147 పరుగులు  చేశాడు. టి20 తరహాలో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఎండ్ లో ఉన్నా రవీంద్ర జడేజా సైతం 88 పరుగులతో సహకారం అందించాడు అని చెప్పాలి. అయితే రిషబ్ పంత్ కేవలం 89 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ సెంచరీ చేసిన తర్వాత డగౌట్ లో కూర్చున్న రాహుల్ ద్రావిడ్ సంతోషంతో ఊగిపోయాడు. ఒక్కసారిగా పైకి లేచి చేతులు పైకెత్తి రిషబ్ పంత్ ని ఎంకరేజ్ చేశాడు. కూల్ అండ్ కామ్ అయిన రాహుల్ ద్రవిడ్ నుంచి ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా అరుదు అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: