వావ్.. మెస్సికీ రెండడుగుల దూరంలో సునీల్ చెత్రి?

praveen
ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ ఆట కి ఉన్నంత గుర్తింపు మరో క్రీడకు లేదు అని చెప్పాలి. అటు ప్రేక్షకులు కూడా క్రికెట్ చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు తప్ప.. మిగిలిన వాటిపై ఎక్కువ దృష్టి పెట్టరు. అయినప్పటికీ ఎంతో మంది ఆటగాళ్ళు అంతర్జాతీయ వేదికలపై అటు భారత పేరును మారుమోగేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి వారిలో భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి కూడా ఒకరు. ఫుట్బాల్ ఆటకు అనుకున్నంతగా భారత్లో ప్రోత్సాహం లేక పోయినప్పటికీ ఇక ఫుట్బాల్ కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించడమే కాదు ఒక ఆటగాడిగా కూడా ఎన్నో అరుదైన రికార్డులు సాధిస్తూ ఉన్నాడు సునీల్ చత్రి.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత ఫుట్బాల్ జట్టు ఏ ఎఫ్ సి ఆసియాకప్ క్వాలిఫైర్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో 45వ నిమిషంలో ఒక గోల్ తో మెరిశాడు సునీల్ చెత్రి. అయితే ఈ గోల్ సునీల్ చెత్రికి 84 వ అంతర్జాతీయ గోల్ కావడం గమనార్హం.  ఇక ఈ గోల్ తో హంగేరీ ఫుట్బాల్ దిగ్గజం అయిన ఫుస్కాన్  తో సమానంగా టాప్-5లో నిలిచాడు సునీల్. హంగేరి జట్టు తరఫున ఫుస్కాన్ 44వ అంతర్జాతీయ గోల్ చేయడం గమనార్హం. కాగా ఈ లిస్టులో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో 117 గోల్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఇరాన్ స్టార్ ప్లేయర్ అయిన అలీ దాయి 109 గోల్స్ తో రెండవ స్థానంలో ఉన్నాడు.

 మొక్తర్ దహరి 89 గోల్స్ తో మూడవ స్థానంలో ఉండగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 86 గోల్స్ తో 4వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న లియోనల్ మెస్సీకి అటు భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి మధ్య కేవలం రెండు గోల్స్ మాత్రమే వ్యత్యాసం ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆసియా కప్ గ్రూప్ డి క్వాలిఫైర్ లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 4-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా.  ఇక ఈ విజయం తర్వాత టేబుల్ టాపర్ గా మారిపోయింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: