టీమిండియాలోకి రావాలంటే అది సరిపోదా.. ఇంకేం కావాలో?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రిక తో టి 20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ లో భాగంగా భారత జట్టుకు చేదు అనుభవమే ఎదురైంది. సొంత గడ్డపై అదరగొడుతుంది అనుకున్న ఇండియా రెండు మ్యాచ్ లలో కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ప్రత్యర్థి కనీస పోటీ  ఇవ్వలేక రెండు మ్యాచ్ లలో కూడా ఓటమి చవిచూసింది. సొంతగడ్డపైనే టీమిండియాను ఊహించని దెబ్బ కొట్టింది సౌత్ ఆఫ్రికా. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా మరో మ్యాచ్లో విజయం సాధించి రెండు మ్యాచ్లు మిగిలి వుండగానే సిరీస్ ఎగరేసుకు పోవాలి అని ప్లాన్ చేసింది.

 ఈ క్రమంలోనే అటు భారత జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. పలువురు ఆటగాళ్లను భారత తుది జట్టులోకి సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కు భారత జట్టులో చోటు దక్కకపోవడంపై స్పందించారు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్. ఈ క్రమంలోనే బిసిసిఐ సెలెక్టర్ల పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల ఉత్తరాఖండ్ లో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో 153 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు సర్ఫరాజ్ ఖాన్.

 ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 702  పరుగులు సాధించాడు అని చెప్పాలి. అయితే సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే టీమిండియా తరఫున ఆడాలి. ఎందుకంటే అతను రంజీ ట్రోఫీ లో ప్రతిసారి పురుగుల చేస్తున్నాడు. టీమిండియా సెలెక్టర్లు మాత్రం  ఇప్పటికీ అతడిని ఎంపిక చేసుకోవడంపై నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటికే ఎనిమిది వందల కంటే ఎక్కువ పరుగులు చేసేందుకు సిద్ధమయ్యాడు.  టీమిండియా లోకి రావాలంటే అతడు ఇంకా ఏం చేయాలో మీరే చెప్పండి. అతని 12 సంవత్సరాల వయసు n7నుండి చూస్తున్నాను. ఎంతో ప్రతిభావంతుడు ఎంతో ఫిట్ గా కూడా ఉంటాడు అంటూ దిలీప్ వెంగ్సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: