కెప్టెన్ గా సక్సెస్.. ప్లేయర్ గా తుస్?

praveen
ప్రపంచ క్రికెట్లో పవర్ హిట్టర్ గా పేరు సంపాదించుకున్న నికోలస్ పూరన్.. ఇప్పుడు  కెప్టెన్గా కూడా సక్సెస్ అవుతున్నాడు. ఇటీవలే వెస్టిండీస్  జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు నికోలస్ పూరన్. ఈ క్రమంలోనే ఇటీవలే అతని కెప్టెన్సీలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్లో భాగంగా ఇక నెదర్లాండ్ పర్యటనలో ఆ జట్టును క్లీన్ స్వీప్ చేసి శుభారంభం చేశాడు. అయితే కెప్టెన్ నికోలస్ పూరన్ సూపర్ సక్సెస్ అయినప్పటికీ ఒక బ్యాట్స్ మెన్ గా మాత్రం పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. కాగా నెదర్లాండ్స్ లో జరిగిన సిరీస్ లో మూడు మ్యాచ్లలో  నికోలస్ పూరన్ సాధించిన స్కోరు 7,10,7 మాత్రమే కావడం గమనార్హం. అంతేకాదు ఇక మూడు మ్యాచ్ లలో కూడా ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ వేసిన బంతికే వికెట్ సమర్పించుకున్నాడు ఈ వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్.

 అయితే నెదర్లాండ్స్ లో వన్డే సిరీస్ పర్యటన ముగియగానే ఇక ఇప్పుడు పాకిస్తాన్ పయనమైంది వెస్టిండీస్ జట్టు. గతంలో కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్  నేడు ప్రారంభం అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన నికోలస్ పూరన్ తన ఫామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఫామ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నేను బాగానే ఉన్నాను.  ఇలా తక్కువ పరుగులకే వికెట్ కోల్పోవడం నాకేమి కొత్త కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 నాపై విమర్శలు చేసేవారు ఒకసారి నా కెరీర్ గణాంకాలు చెక్ చేసుకుంటే బాగుంటుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు. ప్రతిసారి పరుగులు సాధిస్తూనే ఉన్నాను. కానీ అన్ని సార్లు అది కుదరక పోవచ్చు కదా. నెదర్లాండ్స్ లో నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల నిరాశ చెందాను అంటూ తెలిపాడు.. జట్టు విజయం కోసం మంచి పరుగులు చేసి ఉంటే బాగుండేది అని కొంతమంది అనొచ్చు. నిజానికి నేను స్పిన్ బాగా ఆడగల బ్యాట్స్మెన్ ను. ఇక నెదర్లాండ్ వైఫల్యం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. నాకు కలిసిరాలేదు అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: