సచిన్ కు గాయం చేయాలనే బౌలింగ్ చేసా : షోయబ్ అక్తర్

praveen
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఎంత ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక పాకిస్తాన్ భారత్ మధ్య ఇప్పటికే క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి  కేవలం వరల్డ్ కప్ లో తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు ఈ రెండు జట్ల మధ్య అస్సలు జరగవు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచకప్ లో పరస్పరం ఒక జట్టుపై మరో జట్టు పైచేయి సాధించేందుకు హోరా హోరీగా పోరాటం సాగిస్తూనే ఉంటాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే  ఇండియా పాకిస్తాన్ జరిగిన ఎన్నో మ్యాచ్ లలో ఆటగాళ్ల మధ్య గొడవలు జరగడం ఇలాంటివి కూడా జరిగాయి.  ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 2006లో జరిగిన టెస్టు సిరీస్ లో తాను బౌలింగ్ చేసిన ప్రధాన ఉద్దేశం గురించి ఇటీవలే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ ని గాయపరచడం లక్ష్యంగా పెట్టుకుని బౌలింగ్ చేశాను అసలు నిజాలు బయట పెట్టాడు. టెస్ట్ మ్యాచ్లో భాగంగా సచిన్ బ్యాటింగ్ కు దిగగానే  లైన్ అండ్ లెంగ్త్  బంతులు వేయమని అప్పుడు కెప్టెన్గా ఉన్న ఇంజమామ్ సలహా ఇచ్చారు.

 అయితే ఇంజమామ్  చెప్పిన విధంగా లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేసి సచిన్ వికెట్ తీసుకోవాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. అందుకే సచిన్ టెండూల్కర్ ను ఎలాగైనా బంతితో గాయపరచాలని ఉద్దేశంతోనే బౌలింగ్ చేశాను అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు . ఇక ఆ మ్యాచ్లో తాను వేసిన ప్రతి ఒక్క ఓవర్ కూడా ఇలాంటి ఉద్దేశంతోనే బౌలింగ్ చేశాను అంటూ టాకింగ్ విషయాన్ని తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదని మొదటిసారి బయటపెట్టానని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: