వావ్ .. బట్లర్ కు డాన్స్ నేర్పిన చాహల్ భార్య?

praveen
సోషల్ మీడియాలో క్రికెటర్లకు ఏ రేంజిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అటు క్రికెటర్లతో పాటు క్రికెటర్ల భార్యలకు కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది క్రికెటర్ల భార్యలు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఇక తమ ఫ్యామిలీకి సంబంధించిన పలు విశేషాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టీమిండియా స్పిన్నర్  చాహల్ భార్య ధనశ్రీ  ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.

 తన వర్కౌట్స్  కి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడమే కాదు అప్పుడప్పుడు డాన్స్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే ఉంటుంది. ఈ క్రమంలోనే తన భర్త చాహల్ తో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లతో కూడా ధనశ్రీ డాన్స్ లు  చేసిన వీడియోలు ఇప్పటివరకూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో అభిమానులందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ తో పాటు జోష్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

 853 పరుగులతో బట్లర్ టాప్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిస్తే.. ఇరవై ఏడు వికెట్లతో చాహల్ టాప్ వికెట్ టేకర్ గా పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. అయితే ఇటీవలే తన భర్త చాహల్ తో పాటు పరుగుల వీరుడు బట్లర్ తో కలిసి ధనశ్రీ డాన్స్ నేర్పిస్తూ ఉన్న ఒక వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో చూసుకుంటే ధనశ్రీ ముందు నిలుచొని స్టెప్పులు కంపోస్ చేస్తూ ఉంటే బట్లర్, చాహల్ ఆమె వెనకాలే ఉండి సాధన చేశారు. ఇక ఈ వీడియో మొత్తం ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసింది ధనశ్రీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: