టి20 క్రికెట్ లో.. రషీద్ ఖాన్ షాకింగ్ నిర్ణయం?

praveen
రషీద్ ఖాన్.. ఈ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ పేరు చెబితే చాలు బ్యాట్స్మెన్లలో కాస్త వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లను ఎంతో సునాయాసంగా ఎదుర్కొనే బ్యాట్స్మెన్లు రషీద్ ఖాన్ బౌలింగ్ లో మాత్రం తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతూ చివరికి వికెట్ చేజార్చుకోవటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  అందుకే రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడంటే చాలా ఆచితూచి ఆడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. కాగా మొన్నటివరకు ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగిన  రషీద్ ఖాన్ ఈ ఏడాది మాత్రం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు

 ఇక జట్టు మారినా రషీద్ ఖాన్ ప్రదర్శనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు అని చెప్పాలి. అద్భుతంగా రాణిస్తూ ప్రతి మ్యాచ్ లో కూడా కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు అరవై రెండు పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ సీజన్లో ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది అని చెప్పాలి. ఇక జట్టు విజయంలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో కీలక పాత్ర వహించాడు. రషీద్ ఖాన్ దెబ్బకు లక్నో జట్టు 82 పరుగులకే కుప్పకూలిన పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఈ క్రమంలోని రషీద్ ఖాన్ ఇటీవలే టీ20 క్రికెట్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు. ఏడాదిలో టి20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రషీద్ ఖాన్ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. 2022  ఏడాదిలో రషీద్ ఖాన్ ఇప్పటివరకు 27 మ్యాచ్ లలో 40 వికెట్ లతో తొలి స్థానంలో నిలిచాడు. సందీప్ లభిచ్చాని ఇరవై మూడు మ్యాచ్ లలో 38 వికెట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు  ఇక బ్రావో 19 మ్యాచ్ లలో 34 వికెట్లతో మూడవ స్థానంలో జాసన్ హోల్డర్ 17 మ్యాచ్లో 29 వికెట్లతో 4వ స్థానంలో ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: