పాక్ బౌలర్ కి.. చుక్కలు చూపించిన పుజారా?

praveen
మొన్నటివరకు ఫామ్ కోల్పోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొని చివరికి టీమిండియాకు దూరమైన భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా ఇక ఇప్పుడు మాత్రం అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తున్నాడు. వరుసగా సెంచరీలు డబుల్ సెంచరీలు చేస్తూ మళ్లీ టీమిండియాలో కు వచ్చేలా గా కనిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీతో చెలరేగుతున్నాడు. టీమిండియాకు దూరమైన చటేశ్వర్ పుజారా ప్రస్తుతం మునుపటి ఫామ్ అందిపుచ్చుకోవడానికి ఇంగ్లాండ్ కౌంటిలలో ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా చటేశ్వర్ పుజారా సెంచరీ తో దుమ్ము రేపుతున్న తీరు అభిమానులందరినీ కూడా సంతోషపరుస్తుంది.

 కాగా ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా ససెక్స్ జట్టుకు తరఫున ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు ఒక సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఇటీవలే మిడిలేసెక్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా మరో సెంచరీతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఇక వరుసగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పుజారా 149 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు 2 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు చటేశ్వర్ పుజారా. షాహీన్ అఫ్రిది బౌలింగ్లో కళ్లుచెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

 అప్పటికే వరుసగా ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన సస్సెక్స్ జట్టును పూజారా, టామ్ అల్సాఫ్ ఎంతో మెరుగైన ప్రదర్శన చేసి ఆదుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే షాహీన్ అఫ్రిది ఇన్నింగ్స్ లో మూడు ఓవర్లో బంతిని బౌన్సర్ గా వేశాడు. అయితే పుజారా దానిని వదలకుండా అప్పర్ కట్ చేశాడు.  దీంతో ఆ బంతి బౌండరీ ఫెన్స్ దాటి అవతల పడింది. అయితేఇప్పటివరకు చటేశ్వర్ పుజారా పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఎదురు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: