అతడు ఇలాగే ఆడితే.. కష్టమే : గవాస్కర్

praveen
ఈసారి ఐపీఎల్ సీజన్ లో భారీ ధర పలికిన ఆటగాళ్లు పేలవా ప్రదర్శన చేస్తూ ఉంటే.. అతి తక్కువ ధరతో జట్టులోకి తీసుకున్న యువ ఆటగాళ్లు జట్టును కష్ట సమయాల్లో గట్టేక్కిస్తూ ఉన్నారు.  ప్రతి జట్టులో కూడా యువ ఆటగాళ్లే ప్రతి మ్యాచ్లో రాణిస్తుండడం చూస్తూ ఉన్నాం. అయితే ముంబై ఇండియన్స్ లో  జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ కి వచ్చి మంచి స్కోరు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే అటు భారీ నమ్మకం పెట్టుకొని 14.25 కోట్లకు కొనుగోలు చేసిన ఇషన్ కిషన్ మాత్రం తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకోవటం చేస్తున్నాడు.

 ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడం ఇషాన్ కిషన్ కి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే క్యాష్ చేసుకుంటున్న బౌలర్లు వరుసగా షార్ట్ పిచ్ బంతులను సందిస్తూ వికెట్ తీసుకుంటున్నారు. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షార్ట్ పిచ్ బంతులను ఇబ్బంది పడుతూ ఉండడం ఏ మాత్రం మంచిది కాదని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఇటీవలే లక్నోలో జరిగిన మ్యాచ్ అతను 20 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి తీవ్ర ఒత్తిడిలో వికెట్ కోల్పోయాడు.

 ఇక ప్రస్తుతం మాత్రమే కాదు ఇంతకుముందు కూడా పలుమార్లు షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బంది పడ్డాడు  కాగా గవాస్కర్  మాట్లాడుతూ అతడు స్లీప్ లో దొరికిన బంతి కనీసం నిజంగా క్యాచ్ వెళ్లిందా లేదా నేలకు తాగిందా చేతిలో పడింది అని నిర్ధారించుకోకుండా పెవివిలియన్ బాట పట్టాడని గవాస్కర్ పేర్కొన్నాడు. అతను మ్యాచ్ ఆడుతున్న సమయంలో  ఎంతో ఇబ్బంది పడ్డాడు. క్రీజు లో ఉండాలి అనుకోలేదు. సహజంగా ఎవరికైనా బంతి వెళ్లి స్లీప్ పడితే  ఖచ్చితంగా అది ఔట కాదా అని తెలుసుకునేంత వరకు వేచి చూస్తారు. కానీ బంతి హోల్డర్  చేతిలో పడగానే పెవిలియన్ బాట పట్టాడు ఇషాన్ కిషన్. ఎంపైర్ నిర్ధారించకా ముందే ఇషాన్ కిషన్ పెవిలియన్ బాట పట్టడం అతని మానసిక స్థితిని తెలియజేస్తుంది అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: