నా బెస్ట్ బ్యాటింగ్ పార్ట్ నర్ అతనే : రవి శాస్త్రి

praveen
టీం ఇండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి ఆటగాడిగా ఎంత గుర్తింపు సంపాదించాడో కామెంటేటర్ గా కూడా అంతే గుర్తింపు సంపాదించాడు. ఇక మొన్నటికి మొన్న టీమిండియా హెడ్ కోచ్ గా కూడా పదవి బాధ్యతలు చేపట్టి జట్టుని  ముందుకు నడిపించాడు అన్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి కోచింగ్ ఆధ్వర్యంలో అటు టీమిండియా ఎన్నో మరపురాని విజయాలను కూడా సాధించింది. అయితే ఇటీవలే హెడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో రవిశాస్త్రి ఇక కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. మళ్ళీ కామెంటేటర్గా అవతారమెత్తాడు. ఐపీఎల్లో కామెంటేటర్ గా అదరగొడుతున్నాడు.

 ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టివ్గా ఉండే రవి శాస్త్రి ఇక పలు క్రికెట్ మ్యాచ్ లపై తనదైన శైలి లో స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు. అంతేకాకుండా తన కెరియర్ కు సంబంధించిన పలు విషయాలను కూడా రావిశాస్త్రి అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల తన సహచరుల గురించి చెప్పిన రవిశాస్త్రి ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. తన కెరియర్ లో తనకు ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్నర్ ఎవరు అనే విషయాలను  ఇటీవలే చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి.

 ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఈ క్రమం లోనే కృష్ణమాచారి శ్రీకాంత్, సునీల్ గవాస్కర్ లలో ఎవరితో కలిసి బ్యాటింగ్ చేయడం ఎక్కువగా ఎంజాయ్ చేస్తారూ అంటు ఓ స్పోర్ట్స్ ఛానల్ యాంకర్ అడగగా.   సునీల్ గవాస్కర్ పేరు చెప్పాడు రవిశాస్త్రి. గవాస్కర్ బ్యాటింగ్ చేస్తున్న సమయం లో నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉండి అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది  అంటు రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. కాగా కృష్ణమాచారి శ్రీకాంత్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కూడా భారత జట్టు మొదటి వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: