ప్రపంచ క్రికెట్లో.. ఆ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్?

praveen
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఆస్ట్రేలియా విషయం లో కీలకపాత్ర వహిస్తూఉంటాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు.  ఇక ఆస్ట్రేలియా జట్టు విజయం లో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. ఒకప్పుడు కెప్టెన్ గా కొనసాగిన స్టీవ్ స్మిత్  ఆ తర్వాత బాల్ టాంపరింగ్ వివాదాల్లో చిక్కుకోవడంతో  రెండు సంవత్సరాల పాటు నిషేధానికి గురి   అవ్వడం కూడా జరిగింది.

 ఇక ఆ తర్వాత నిషేధం పూర్తయ్యాక అతని కెప్టెన్సీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్లో టెస్టు సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో అందరూ కూడా రెచ్చిపోయి భారీగా పరుగులు చేస్తూ ఉండటం  గమనార్హం. ఇటీవలే ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ స్మిత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 59 పరుగులు చేసి వికెట్లు కోల్పోయాడు స్మిత్. చేసింది 59 పరుగులే కదా అందులో గొప్పేముంది అని అనుకుంటున్నారు కదా.

 చేసింది 59 పరుగులు అయినప్పటికీ ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు స్టీవ్ స్మిత్. ఏకంగా టెస్టుల్లో 150వ ఇన్నింగ్స్ దగ్గర అత్యధిక పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్ రికార్డు సృష్టించాడు. ఇక 150 ఇన్నింగ్స్ దగ్గర ఏకంగా7993 పరుగులు సాధించాడు స్మిత్. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఏడు వేల 913 పరుగుల రికార్డును స్టీవ్ స్మిత్ అధిగమించాడు అనే చెప్పాలి. ఇక స్మిత్  తరువాత వరుసగా టీమిండియా త్రయం సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ సాగుతూ ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: