సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రావిడ్.. ఏమన్నాడో తెలుసా?

praveen
భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు సంపాదించుకున్న వృద్ధిమాన్ సాహా.. గత కొంతకాలం నుంచి భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు బిసిసీఐ అతనికి అవకాశం వచ్చినప్పటికీ అడపదడప ప్రదర్శనకి నిరాశ పరుస్తున్నాడు. దీంతో బీసీసీఐ పూర్తిగా అతని పక్కన పెట్టేసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయ్ అన్న విషయం తెలిసిందే.

 హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రిటైన్ అవ్వాలని అంటూ నాకు సూచించాడు అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వృద్ధిమాన్ సాహా  వ్యాఖ్యలు సంచలనంగా మారగా ఈ విషయంపై ఇటీవల కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడూ. సాహ తనపై చేసిన ఆరోపణలు తనను బాధించలేదు అంటూ తెలిపాడు. ఇండియా సాధించిన ఎన్నో విజయాలలో కారణమైన సాహా పై తనకు ఎంతో గౌరవం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు.  అయితే తుది జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో కఠినంగా ఉంటామంటూ చెప్పుకొచ్చాడు ద్రావిడ్.

 అయితే ఆటగాళ్ళను పక్కన పెట్టినప్పుడు ఎందుకు సలెక్ట్ చేయడం లేదు అని కారణాలు వారికి ముందే వివరిస్తామని.. చెప్పే కారణాలు ఆటగాళ్లను బాధ కలిగించినా తాము మాత్రం నిజమే చెబుతాము అంటూ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు  ఇలా చెప్పడం వల్ల ప్రతి ఆటగాడు లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంది. అందుకే ఆటగాళ్ల విషయంలో కాస్త కఠినంగానే మాట్లాడాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్. ఈ వ్యాఖ్యలను వృద్ధిమాన్ సాహా మీడియా ముందు చెప్పాల్సింది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు అందరికీ కూడా ఎలా చెప్పానో ఇక వృద్ధిమాన్ సాహాకూ కూడా అలాగే వివరించానని అతను మాత్రం నేను చేసిన వ్యాఖ్యలను స్వీకరించలేక పోయాడు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: