రోహిత్ శర్మ.. జీరో నుంచి హీరో వరకూ?

praveen
రోహిత్ శర్మ.. ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా ఇతని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే మొన్నటివరకూ భారత జట్టులో స్టార్ ఓపెనర్ గా మాత్రమే కొనసాగాడు.. వైస్ కెప్టెన్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇటీవలే అనూహ్య పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ లో మూడు ఫార్మాట్ లకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా అవతరించాడు. ఇక ఇప్పుడు జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తన సత్తా ఏంటో చూపించాడు రోహిత్ శర్మ. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా రికార్డుల కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడు.

 అయితే రోహిత్ శర్మ ఎంత అత్యుత్తమ బ్యాట్స్మెన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు.. అందుకే అభిమానులందరూ రోహిత్ శర్మ హిట్ మాన్  అని పిలుచుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది డబుల్ సెంచరీల వీరుడు అని అంటూ ఉంటారు. అయితే రోహిత్ శర్మ సక్సెస్ అయిన తర్వాత అతని కెరీర్ గురించి అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు భారత జట్టులో చోటు తగ్గించు కోవడానికి కూడా రోహిత్ శర్మ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడూ అనే విషయం చాలా మందికి తెలియదు.

 ఒకప్పుడు రోహిత్ శర్మ కు జట్టులో చోటు దక్కడం గగనం అనే విధంగా ఉండేది పరిస్థితి. అలాంటి దశనుంచి టీమిండియాకు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు రోహిత్ శర్మ. 2013 వరకు రోహిత్ శర్మ కెరియర్ ఎంతో నెమ్మదిగానే సాగింది. కానీ 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా అవతారం ఎత్తిన తర్వాత రోహిత్ శర్మ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు రోహిత్ శర్మ. 2019 వరల్డ్ కప్ లో ఏకంగా ఐదు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. ఇక 2013 నుంచి 2021 మధ్యకాలంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో తక్కువ సమయంలో ఐదుసార్లు ముంబై ఇండియన్స్ కు టైటిల్ అందించి ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: