'రాహుల్ ద్రావిడ్' కోచ్ గా ఫెయిల్ అయ్యాడా ?

VAMSI
క్రికెట్ లో విజయం అపజయం అన్నవాటిని ఎప్పుడూ సమానముగా చూడగలిగే ఆటగాడు కానీ లేదా కెప్టెన్ లేదా కోచ్ మాత్రమే సక్సెస్ ఫుల్ గా కొనసాగగలడు. ఎందుకంటే రెండు జట్ల పోటీ అన్నాక గెలుపు ఓటమి అనేది ఎవరికో ఒకరికి దక్కాల్సిందే. ఓటమితోనే ఎన్నో విజయాలు ప్రారంభం అవుతాయి అన్న విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పరిస్థితిలో టీం ఇండియా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇక్కడ ప్లేయర్ గురించి కన్నా వారిని వెనక ఉండి నడిపించే కోచ్ ల గురించి మాట్లాడుకోవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ వచ్చి దాదాపుగా ఆరు నెలలు పూర్తి కావస్తోంది. 

గత సంవత్సరం జులై లో శ్రీలంక పర్యటనతో ఇండియా కోచ్ గా తన ప్రయాణం ప్రారంభం అయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను ఒకసారి పరిశీలిస్తే రాహుల్ ద్రావిడ్ నుండి కూడా అంత త్వరగా ఫలితాలను రాబట్టడం అసాధ్యం అని క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు అందరి చర్చ అంతా సౌత్ ఆఫ్రికా పర్యటనలో వైఫల్యం చెందిన తీరు గురించే, మొదటి టెస్ట్ లో విజయాన్ని సాధించి ఊపుమీదున్న ఇండియా ఆ తర్వాత గెలుపు రుచి చూడలేకేపోయింది అంటే తప్పు ఎక్కడ జరిగింది. ఇక్కడ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ చేసిన పొరపాటు ఏమిటి అన్నది చూస్తే,
* ఇండియన్ సీనియర్ మెన్ హెడ్ కోచ్ గా రాక మునుపు రాహుల్ ద్రావిడ్ ఒక ఇండియా వాల్ అని, ఇండియా ఏ మరియు అండర్ 19 జట్లను తీర్చి దిద్దిన ఘనుడని పేరు ఉంది. ఇలా ఒక కోచ్ గా తనపై అంచనాలు ఎక్కువ అయ్యాయి. ఇది ఒక కారణం కావొచ్చు.
* వరల్డ్ కప్ 2021 లో కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటలేక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ప్లేయర్స్ లో స్ఫూర్తి అంతమైపోయిందా? అప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఒక్క సారిగా అన్ని ఫార్మాట్ లకు స్వస్తి పలకడం కూడా ఒక కారణం కావొచ్చు.
* రాహుల్ ద్రావిడ్ ఆటగాళ్లను పరిశీలించి వారికి  తగిన సూచనలు ఇస్తున్నాడా? లేదా ప్లేయర్ లు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆడనీలే అని వదిలేశారా? అన్న క్లారిటీ అతనికే తెలియాలి.
* ఒక కోచ్ గా 19 సంవత్సరాల వారిని లీడ్ చేయడానికి, ఒకేసారి సీనియర్ టీమ్ ను లీడ్ చేయడానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. తన ప్రణాళికలను మార్చుకోకుండా అవే అప్లై చేశాడా?
* బీసీసీఐ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం కావడానికి బయట చాలా కారణాలు వినిపిస్తున్నా రాహుల్ ద్రావిడ్ మానసికంగా ఇంకా ఫుల్ ప్లెడ్జ్ కోచ్ గా తయారు కావలసి ఉంది. ఇక ఇలాగే ఈజీ గా తీసుకుంటే తనకున్న పేరు అంతా ఈ ఒక్క కోచ్ తోనే పోయే ప్రమాదం లేకపోలేదు.
మరి చూద్దాం వెస్ట్ ఇండీస్ సిరీస్ లో అయినా మంచి విజయాలను అందించి తానేంటో నిరూపించుకుంటాడా లేదా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: