వారెవ్వా.. దినేష్ కార్తీక్ ఇరగదీశాడుగా?

praveen
భారత్లో జరిగే దేశవాళీ టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీ కి ఎంతగానో ప్రత్యేకత ఉంది. ఎంతో మంది యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా విజయ్ హజారే ట్రోఫీ లో  తమ సత్తా చాటుతున్నారు. మళ్లీ భారత జట్టులోకి అరంగేట్రం చేయడానికి దేశవాళీ టోన్ విజయ్ హజారే ట్రోఫీ ఎంతో మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ లలో ఎంతోమంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారనే విషయం తెలిసిందే. ఐపీఎల్ లో రాణించిన యువ ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీ లో కూడా వరుస సెంచరీలతో అదరగొట్టారు.

 ఇక టీం ఇండియా ఫ్యూచర్ స్టార్ట్ మేమే అంటూ చెప్పకనే చెబుతున్నారు ఎంతో మంది యువ ఆటగాళ్లు. అయితే కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే కాదు అటు సీనియర్ ప్లేయర్స్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో బాగా రాణిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఒకప్పుడు టీమిండియాలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా వికెట్ కీపర్ గా కొనసాగిన దినేష్ కార్తీక్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ లో ఇరగదీశాడు. గత కొంత కాలం నుంచి సరైన ఫామ్ లో లేక ఇబ్బందులు పడిన దినేష్ కార్తీక్ ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీ లో మాత్రం మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.. ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఏకంగా 103 బంతుల్లో 116 పరుగులు సాధించి అదరగొట్టాడు దినేష్ కార్తీక్.

 ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో దేశవాళీ టోర్నమెంట్ ఫైనల్ జరిగింది. ఇక ఈ ఫైనల్లో తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది హిమాచల్ప్రదేశ్ జట్టు.  అయితే భారీ అంచనాల మధ్య బ్యాటింగ్కు దిగిన తమిళనాడుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.. ఓపెనర్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ లు కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయారు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణించాడు. నిలకడగా ఆడుతూ సెంచరీతో అదరగొట్టాడు దినేష్ కార్తీక్. అతనికి తోడుగా ఇంద్రజిత్ సైతం 80 పరుగులతో రాణించాడు. ఇలా పది వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ లక్ష్యాన్ని హిమాచల్ ప్రదేశ్ ముందు ఉంచింది తమిళనాడు జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: