జట్టు కోసం అలా చేయక తప్పదు : రాహుల్ ద్రావిడ్

praveen
భారత్ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెస్ట్ మ్యాచ్ రేపు ప్రారంభం కాబోతుంది. టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించ బోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే మొదటి సారి టీమిండియా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో విదేశీ పర్యటనకు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాపై రాహుల్ ద్రావిడ్ కోచింగ్ ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక తుది జట్టులో ఎవరెవరు చోటు దక్కించుకుంటారు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఇక రేపు జరగబోయే టెస్ట్ కి సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇటీవలే ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా మాట్లాడిన టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ సఫారీల గడ్డ పై టెస్ట్ సిరీస్లో విజయం సాధించాలి అంటే టీమిండియా తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. టీమ్ ఇండియా లో ఎంత మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం కొంతమందిని పక్క పెట్టక తప్పదు అంటూ తెలిపాడు.

 అంతేకాకుండా సెంచూరియన్ వేదికగా జరగబోతున్న మొదటి బాక్సింగ్ డే టెస్టు లో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలని దానిపై పూర్తిస్థాయి స్పష్టత ఉంది అంటూ చెప్పుకొచ్చాడు..  ఇక కొన్ని కొన్ని సార్లు జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అంటూ తెలిపాడు.. ప్రస్తుతం అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా ల తో పాటు ప్రతి ఒక్కరు తో కూడా వ్యక్తిగతంగా మాట్లాడాను.. తిరిగి ఫామ్ లోకి రావడానికి  అజింక్యా రహానే తీవ్రంగా ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో అజింక్యా రహానే, ఇషాంత్ శర్మలు ఎవరికో ఒకరికి మాత్రమే తుది జట్టులోకి స్థానం దక్కుతుంది అంటూ తెలిపాడు. అయితే టాస్ ముగిసిన తర్వాతనే తుది జట్టును ప్రకటిస్తామని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిస్తే ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో కి నెట్టేందుకు అవకాశం ఉంటుంది. టీం ఇండియా లో ఫేస్ దళం ఎంతో పటిష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. బౌలర్లతో  పాటు బ్యాట్స్మెన్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: