ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ అంచనాలను నిలబెట్టుకుంటాడా ?

VAMSI
భారతీయ క్రికెట్ లో ఒక ప్లేయర్ గా సేవలను అందించి మళ్లీ అదే ఇండియా క్రికెట్ టీమ్ కు కోచ్ గా రావడం అనేది ఎంతో గర్వించదగిన క్షణం. మామూలుగా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇండియా ఫార్మర్ క్రికెటర్ అండ్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఇండియన్ మెన్ క్రికెట్ టీమ్ కు న్యూ కోచ్ గా ఎంపికయ్యాడు. ఈ నెల 17 వ తేదీ నుండి న్యూజిలాండ్ తో జరగనున్న సీరీస్ తో రాహుల్ ద్రావిడ్ కోచ్ గా తన బాధ్యతలను తీసుకోనున్నారు. రాత్రి టీ 20 వరల్డ్ కప్ లో నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ తో నిన్నటి వరకు ఇండియా కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం పూర్తయింది.
వరల్డ్ కప్ లో దారుణమైన ఆట తీరును ప్రదర్శించి సెమీఫైనల్ కూడా చేరకుండానే ఇంటి ముఖం పట్టింది టీమిండియా. ఇప్పుడు గతి తప్పిన టీమ్ ఇండియాను సరి చేయాల్సిన బాధ్యత కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ఉంది. ఒక ఆటగాడిగా, కెప్టెన్ గా ఎన్నో సక్సెస్ లు అందుకున్న గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాహుల్ ద్రావిడ్ కు ఇది చాలా ఛాలెంజింగ్ అని చెప్పాలి. అయితే ఇంతకు ముందు ఎన్ఐఏ అధ్యక్షుడిగా మరియు ఇండియా అండర్ 19 జట్టు కోచ్ గా మరియు ఒకే ఒక్క సిరీస్ కి  సీనియర్ మెన్ టీమ్ కోచ్ గా చేసిన అనుభవం వుంది.
అయితే ఇక్కడ సీన్ మాత్రం వేరేగా ఉంటుంది. ప్లేయర్స్ అందరినీ కలుపుకుని పోతూ వారిలోని టాలెంట్ ను వెలికి తీయడమంటే మాములు విషయం కాదు. మరి రాహుల్ ద్రావిడ్ ఏ విధంగా తన నైపుణ్యాన్ని టీం ఇండియా అభివృద్ధి కోసం ఉపయోగిస్తాడు అన్నది చూడాల్సి ఉంది. చాల మంది కోచ్ పదవి కోసం అప్లికేషన్ లు పెట్టుకున్నా ఏకగ్రీవంగా రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. మరి ఇంత అపారమయిన నమ్మకాన్ని రాహుల్ ద్రావిడ్ నిలబెట్టుకుంటాడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: