రిషబ్ పంత్ పై సంచలన కామెంట్స్ చేసిన దినేష్ కార్తీక్ ..!

Divya
ఇటీవల ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్లో చాలా బాగా రాణించగలరు అని ఆ నమ్మకం నాకు ఉందని తెలిపాడు దినేష్ కార్తీక్.. ఇక భారత్ మంచి విజయం సాధిస్తుందని అని ఆయన తెలిపాడు.. ముఖ్యంగా సిరీస్ కోసం ప్యానెల్ లో భాగమైన వికెట్ కీపర్ గుర్తింపు పొందిన రిషబ్ పంత్ కచ్చితంగా బాగా ఆడగలడు అనే నమ్మకం ఉందని అని దినేష్ కార్తీక్ తెలపడం గమనార్హం.
23 సంవత్సరాల వయస్సు కలిగిన రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ లో తరచుగా ప్రశంసలు అందుకున్నాడు.. బ్యాట్స్ మెన్ గా అతను రాణించగలరని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 5 ఇన్నింగ్స్ లో  17.4 0 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే చేయడంతో అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..
అయితే కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే , వారి ఆలోచనలను తిప్పికొడుతూ ఆస్ట్రేలియాలో చాలా పరుగులు సాధించాడు. మీరు అతనికి కొంత సమయం ఇవ్వాలి ..ఇక అతడు తన ప్రతిభను చూపిస్తాడు అంటూ కార్తిక్ తెలిపాడు.. సిరీస్ మధ్యలో తనను మార్చాల్సిన అవసరం లేదని , ఇక ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అతనికి బాగా తెలుసు అని ఖచ్చితంగా మ్యాచ్ ను విన్  చేస్తాడు అని తెలిపాడు కార్తీక్..
రిషబ్ పంత్ ఆస్ట్రేలియాతో జరిగిన 2020 - 21 టెస్ట్ సిరీస్లో ఐదు ఇన్నింగ్స్ లో  274 పరుగులు చేసి భారత దేశంలోనే అత్యంత పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. చివరిసారిగా గబ్బా లో జరిగిన టెస్టులో నాల్గవ ఇన్నింగ్స్ లో 138 బంతులకు 89 పరుగులు చేసి భారతదేశానికి విజయపథం వైపు నడిపించాడు.. ముఖ్యంగా గత మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం ఇదే మొదటిసారి అదికూడా రిషబ్ పంత్ వాళ్ళ ఓడిపోవడం చాలా గర్వకారణం.. ఇకపోతే రిషబ్ పంత్ కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అంటూ తెలిపాడు దినేష్ కార్తీక్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: