ఆ క్షణాన నా గుండె పగిలిపోయినట్లుగా అనిపించింది - చహల్

ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో  మొదటి సెమిస్ లో  న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో   ధోని ఓటైనా క్షణాన కొన్ని కోట్లాది మంది  హృదయాలు  బద్దలయ్యాయి. ధోని  కన్నీరు  ఆపుకుంటూ  పెవిలియన్ చేరిన దృశ్యం  ఎంతో  మందిని తీవ్రంగా కలిచివేసింది.   ఆ సమయంలో  నేను కూడా  కన్నీరు ఆపుకోవడానికి చాలా కష్టపడ్డాను  అని అన్నాడు  టీం ఇండియా యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.   తాజాగా ఇండియా టుడే నిర్వహించిన ఓ సమ్మిట్ లో పాల్గొన్న సందర్బంగా చహల్  ఆ మ్యాచ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ధోని ఔటై పెవిలియన్  చేరుతుంటే ఆ సమయంలో  నేను బ్యాటింగ్ కు వెళ్తున్న... ఆక్షణాన  నా గుండె  పగిలిపోయినట్లు గా అనిపించింది. ధోని ఔట్ కావడంతోనే  మ్యాచ్  ఓడిపోయామని  నిర్ధారణకువచ్చాం. వర్షం ఆమ్యాచ్ ను శాసించింది అని  చహల్  అన్నాడు. 



ఇక చాహల్ విషయానికి వస్తే  ఐపీఎల్ ద్వారా  వెలుగులోకి వచ్చిన ఈ స్పిన్నర్  అనతికాలంలోనే  వన్డే , టీ 20  ల్లో టీం ఇండియా తరుపున  వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అయితే  ఇటీవల  చహల్  పెద్దగా రాణించకపోవడంతో  ప్రస్తుతం అతనికి  టీం లో ప్లేస్ ఉండేది అనుమానంగా మారింది.  ముఖ్యంగా యువ స్పిన్నర్ల నుండి  చహల్ తీవ్ర పోటీ ని ఎదుర్కొంటున్నాడు.  ఈనేపథ్యంలో  వచ్చే టీ 20 ప్రపంచ కప్ లో  చహల్ జట్టులో చోటు సంపాదించుకుంటాడో లేదో  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: