“వరల్డ్ కప్ -2019” రేసులో ఈ ఇద్దరు లేరా.?

Bhavannarayana Nch

భారత జట్టు సీనియర్ బౌలర్స్..ఇద్దరు స్పిన్ మాంత్రికులు వచ్చే “2019 వరల్డ్ కప్” కి దూరం కానున్నారా..? జట్టులో స్థానం కోల్పోయారా అంటే కొంతమంది సీనియర్ ప్లేయర్స్..క్రికెట్ విశ్లేషకుల మాటలని బట్టి అర్థం అవుతోంది..భారత జట్టు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ , జడేజాల కి చోటు దక్కడం మాత్రం కష్టమే అంటున్నారు..అంతేకాదు వీరిద్దరి స్థానాల్లో ఇప్పుడు జట్టులో దూసుకుపోతున్న ఇద్దరు స్పిన్నర్లకీ  వరల్డ్ కప్ కి ఆడే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు..వివరాలలోకి వెళ్తే..

 

 

దక్షిణాఫ్రికా టూర్ లో బౌన్సీ పిచ్ లపై అద్భుతంగా రాణించి…భారత్ కి మొదటి విజయం అందించిన “కుల్దీప్ యాదవ్, చాహల్” లకే వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట..ఇది కేవలం వీరి అభిప్రాయం మాత్రమె కాదట జట్టు మేనేజ్ మెంట్, సెలక్షన్ కమిటీ కూడా  ఈ విధంగానే ఆలోచిస్తున్నాయి అని తెలుపుతున్నారు..ఇదిలా ఉంటే ఎంతో అనుభవం ఉన్న అశ్విన్ జడేజా లని కాదని ఈ టూర్లో “కుల్దీప్ యాదవ్, చాహల్” సెలెక్ట్ చేయడంతో ఎన్నో విమర్శలు రేగాయి కూడా..ఈ సమయంలోనే

 

ఐదు వన్డే మ్యాచ్‌ల్లో చాహల్‌, కుల్దీప్‌ కలసి 30 వికెట్లు నేల కూల్చి జట్టు చారిత్రక సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. దాంతో ఈ ఇద్దరిపైనే సెలక్టర్స్ దృష్టి అంతా పడిందని అంటున్నారు.. దక్షిణాఫ్రికాతో సిరీస్ విజయం తరువాత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటలను బట్టి చూస్తే..ఇద్దరు సీనియర్స్ కంటే కూడా “కుల్దీప్ యాదవ్, చాహల్” లకే చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది..అయితే తుది నిర్ణయాలలో మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చని కూడా చెప్తున్నారు ఎందుకంటే జట్టులో కనీసం సీనియర్స్ లేకపోతే ఎలా అనే వాదన కూడా ఉందని తెలుస్తోంది..సో  2019 వరల్డ్ కప్ ఆడే భారత జట్టుకి ఎవరు సెలక్ట్ అవుతారో అని ఉత్ఖంట మాత్రం అందరిలోనూ ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: