మాఘమాసం విశిష్టత ఏంటో తెలుసా..?

Divya
భారతీయ సంవత్సర కాలంలో వచ్చే 11 చంద్ర మాసం 10 వ సౌర మాసాన్ని మాఘమాసం అంటారు. మగ నక్షత్రం లో కూడిన పూర్ణిమ రావడం వల్ల ఇది మాఘమాసం అయ్యింది.. మాగం అంటే పాపం.. పాపాన్ని హరించే దే కనుక మాఘమాసం అన్నారు. మాగం అజ్ఞానాన్ని హరించి, జ్ఞాన ప్రసాదించేది కావడంతో వేద మాసం అని అంటారు. మాగం అంటే యజ్ఞం యజ్ఞానికి అధిష్ఠానదైవం ఇంద్రుడు.. ఇంద్రుడిని మాఘవుడు అని అంటారు.అందుచేతనే ఈ దేవుడి మీద మాఘమాసం ఏర్పడింది. హేమంత్ , శిశిర రుతువు సంధికాలంలో వచ్చే ఈ మాగం అత్యంత పుణ్య మైనదిగా భావిస్తారు.
ఇక ఇలాంటి సమయంలోనే వివాహానికి, గృహప్రవేశానికి , ఏదైనా శుభకార్యాలకు భాగం ఎంతో అనుకూలమైనది. మాఘమాస సమయంలో ఆదివారం రోజున సూర్యుని పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.. ఈ మాసంలో స్నానం, దానం, తపస్సు వంటివి చేయడం వల్ల.. చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా విష్ణు పూజ కూడా చేయడం చాలా మంచిదట. ఇక అంతే కాకుండా మాఘ శుద్ధ విద్య నాడు.. త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు ప్రారంభమవుతాయి. తదియ రోజున బెల్లం,ఉప్పు దానం చేస్తారట. ఉమా పూజ, లలిత ప్రస్థానం, వంటివి ఆచరిస్తూ ఉంటారు.
ఈ మాసంలో తలమీద జిల్లేడు ఆకులు, రేగు పండ్లు వేసుకుని స్నానం చేస్తారు. పొంగలి చేసి  చిక్కుడు ఆకులు మీద పెట్టి.. సూర్యునికి నైవేద్యంగా పెట్టి అర్పిస్తారట. నవమి రోజున నందిని పూజను చేస్తారు. ఏకాదశి నాడు భీమ ఏకాదశి వ్రతం చేస్తారు. దీనిని భీష్మఏకాదశి గా కూడా పిలుస్తారు. ద్వాదశి రోజున వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు. ఇక ఈ మాసం సముద్ర స్నానానికి అత్యంత పర్వదినమైన రోజు అని చెప్పవచ్చు.రామకృష్ణ పరమహంస ఈ మాసంలోనే జన్మించారట. తులసి దళం, అన్నం, సాలగ్రామం , గొడుగు, వస్త్రాలు, చెప్పులు మాధవ ప్రీతిగా లో దానం చేసినట్లు అయితే.. అంతా మంచి జరుగుతుందని కొంతమంది పండితులు తెలియజేయడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: