మనఇంటి ముందర ఎందుకు ముగ్గు వేయాలో తెలుసా..?

Divya
అసలు ముగ్గు ఎందుకు వేస్తారు.. వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి.. ముగ్గుని ఎక్కడ వేయాలి అనే విషయాలపై కొంత మందికి సందేహాలు ఉండవచ్చు. అయితే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముగ్గు వేయడం వల్ల , ఇంటి అలంకరణ మారిపోతూ ఉంటుంది.
1). ముగ్గుని గేటు బయట, గుమ్మం ముందు వేయడం వలన.. ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించ లేవట. అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అవి చూస్తాయట.
2) ముగ్గు వేసేటప్పుడు శుభకార్యాలకు వెళుతున్నావా రు.. రెండు అడ్డగీతలు నాలుగు వైపులా గిస్తే వారు అనుకున్న పని జరుగుతుందట. ముఖ్యంగా ఏదైనా పండుగలలో ఇలాంటివి కచ్చితంగా వేయాలట.
3). నక్షత్రం ఇలాంటి ముగ్గు వేయడం వలన ప్రేత పిశాచాలు ఆ ఇంటి వైపు కూడా రావని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. మనం ఎటువంటి చుక్కల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయట.
4). తులసి కోట దగ్గర అష్టదళ పద్మం మొగుని వేసి.. అక్కడ దీపం వెలిగించడం వలన అంతా మంచే జరుగుతుందట.

5). కొత్తగా వివాహం అయినా వారు మొదటిసారిగా భోజనం చేసేటప్పుడు వార్ ఇరుపక్కల పుష్పాలు, లతలు ముగ్గును వేయడం మంచిదట
6). ఎవరైనా  మహిళలలు అమ్మవారి  దేవాలయం ముందు.. ముగ్గును వేస్తున్నట్లు అయితే వారికి ఏడు జన్మల వరకు సుమంగలి గానే భాగవత పురాణం తెలియజేస్తూ.
7). ఏదైనా పండగలు వచ్చినప్పుడు.. నడవడానికి వీలులేకుండా ఉండే అంత ముగ్గులు వేయకూడదు
8). ముఖ్యంగా ప్రతి రోజు ఇంటి ముందు భాగము, తులసి చెట్టు దగ్గర, ఖచ్చితంగా ముగ్గు వేయాలి.
9). అప్పట్లో ఎక్కువగా సాధువులు,సన్యాసులు ప్రతి ఇంటికి తిరిగి బిక్షం అడుక్కునే వారు. ఇక ఏంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వారు వెళ్లే వారు కాదట. ముగ్గు లేకపోతే ఆ ఇంట ఏదో అశుభం జరిగిందని గుర్తుగా ఉండేదట.
ముగ్గు కూ ఇంత ప్రాముఖ్యత ఉన్నదనే సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: