నదీస్నానాలు ఎందుకు చేస్తారు.. దాని పరమార్థం ఏమిటో తెలుసా..?

Divya
పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా అక్కడ ఉన్న నదులలో నదీ స్నానం తప్పకుండా చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.. ఇక దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా నదీస్నానమాచరించి ఆ తర్వాత భగవంతుడిని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు.. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే పుష్కర సమయంలోనూ, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసంలోనూ విశేషమైన పుణ్య దినాలలో కూడా నదీ స్నానాలను తప్పనిసరిగా ఆచరించాలి.. అని పురోహితులు చెబుతున్నారు.
ముఖ్యంగా గంగా, యమునా, కృష్ణ ,గోదావరి, తుంగభద్ర, నర్మదా, గౌతమి వంటి పుణ్య నదీ తీరాల వెంట ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. తప్పనిసరిగా గంగానదిలో స్నానం చేయడం వల్ల అప్పటి వరకు మనం చేసిన పాపాలు  అన్నీ తొలగిపోతాయని భక్తుల లో అపారమైన నమ్మకం కూడా ఉంది.. గోదావరి నదిలో మనం ఒక్కసారైనా స్నానం చేస్తే 100 సంధ్యా వందనాలు చేసిన పుణ్యఫలం కూడా మనకు దక్కుతుంది అని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎవరైనా సరే శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా కృష్ణానదిలో స్నానం చేసి, ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడం వల్ల ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందట.. ఇక తుంగభద్ర నదిలో స్నానం చేస్తే సత్యలోక ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి.. ముఖ్యంగా గౌతమి నది స్నానమాచరించడం వల్ల పుణ్యఫలాలు మనకు తప్పకుండా లభిస్తాయట.. అంతే కాదు నర్మదానదిలో మనం స్నానం చేసి మనం అనుకున్నది ఎవరికైనా దానం ఇస్తే విష్ణు లోక ప్రాప్తి కూడా కలుగుతుంది..
ఈ నదీస్నానాలు అన్నీ ఒక ఎత్తు అయితే పుష్కర కాలంలో ఆయా నదులలో మనం స్నానం చేసి దైవదర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఈ నదులు అన్నింటి లో స్నానాలు ఆచరించి పుణ్యఫలాలను పొందిన తరువాత సువర్ణముఖీ నదీ తీరంలో జన్మిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు గనక ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలని వెళ్తే కచ్చితంగా నదీస్నానమాచరించి , ఆ తర్వాత దైవ దర్శనం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: