ఉద్యోగ ప్రదేశంలో సమస్యలున్నాయా....? అయితే ఇలా చేయండి...?

VAMSI
శ్రీరామ పరమ భక్తుడైన హనుమంతుడిని కొలిచేందుకు ఎన్నో రకాల రూపాలున్నాయి. అయితే ముఖ్యముగా  పూజించేటప్పుడు కొన్ని రూపాల్లో ఉన్న ఆంజనేయుడి విగ్రహాలను మాత్రమే  పూజిస్తే అన్ని కష్టాలు తీరిపోయి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మీకు ఉండే ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయి. రామాయణంలో హనుమంతుడికి ఎంత విశిష్టతవుందో మీకు తెలిసినదే. శ్రీరామునికి అత్యంత ఆప్తుడైన వీరాంజనేయుడు చిరంజీవిగా వర్ధిల్లారని మనము వినే ఉంటాము.

శ్రీరామునిపై ఉన్న భక్తి పారవశ్యంతో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడినే తన గుండెల్లో బంధించి తన అపారమైన విశ్వాసాన్ని మరియు భక్తిని లోకానికి తెలియచెప్పాడు. ఆంజనేయుడు అంటేనే భయంలేనివాడు, బుద్ధిశాలి, ధైర్యశాలి, పరాక్రమవంతుడు మరియు మహాశక్తి సంపన్నుడు. సాధారణంగా ఎవరికైనా భయం వేసినప్పుడు లేదా పీడకలలు వచ్చినప్పుడు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు.  ఒకవేళ మీరు కనుక ఆంజనేయుడి భక్తులయితే క్రింది విషయాలను తప్పకుండా ఆచరించాలి. ప్రముఖ జ్యోతిష్కులు ప్రమోద్ పాండే ఆంజనేయుడి గురించి ఈ విషయాలను వివరించారు. ఈ మహా   సాధ్వి చెప్పినవిధముగా మీరు కనుక పాటించినట్లయితే మీ జీవితం పరమ పావనం అవుతుంది మరియు మీరు కోరిన కోరికలు తప్పక ఫలిస్తాయని తెలిపారు.

మీరు హనుమంతుడిని ఉత్తరాభిముఖం అంటే దక్షిణం వైపుగా ప్రతిష్టించి పూజలు చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా సకల దేవతల ఆశీర్వాదాలు పొందుతారని ప్రతీతి. ఒకవేళ మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారం లేదా వృత్తుల్లో ఏవైనా సమస్యలున్నట్లయితే మీరు తెలుపు రంగులో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పూజించాలి. ఇది వృద్ధికి మార్గాలను తెరుస్తుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని లాభాల బాట పరుగులెత్తిస్తుంది. ఇంట్లో ఇలాంటి ప్రతిమను పూజించినట్లయితే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఇదే సమయంలో పని ప్రదేశంలో ఇబ్బందులున్నట్లయితే అవి తీరిపోతాయి. శ్రీరాముడిని సేవిస్తున్నట్లున్న హనుమంతుడి విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే దేనికీ కొరత ఉండదు. ఇంట్లో అందరూ సుఖ-సంతోషాలతో ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: