రాహు కేతువుల సంచారం .

రేపటి నుండి అనగా ఆగష్టు 18 శుక్రవారం నుండి రాహు గ్రహము  '' సింహ రాశి నుండి కర్కాటకము లోకి " కేతువు కుంభము నుండి మకరము లోకి "  మారబోతున్నారు నవ గ్రహాలలో శని గ్రహం తరువాత ఒక రాశిలో  ఎక్కువ కాలం ఉండేది  రాహు కేతువులే (   శని 2 సం.ల. 6 నెలలు / రాహు కేతువులు 1 1/2 సం,లు.) స్వతహాగా పాప గ్రహాలు అయిన రాహుకేతువులు కేవలం 3 - 6 - 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తారు. 1 - 4 - 8 - 12 స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు ఇస్తారు. 


ఏయే రాశులకు ఎలా ఉంటుందో చూద్దాం !
రాశి                  రాహు స్థానం   -     కేతు స్థానం 
మేషం             4 అనారోగ్యము     10 కలహము
వృషభం         3  శుభము        9 వ్యధ
మిథునం         2 కలహము          8 పగలు
కర్కాటకం       1భయము         7 చిక్కులు  
సింహం           12 తాపము            6 గౌరవము
కన్య                 11 లాభము        5 వ్యయము
తుల               10 హాని             4 అనారోగ్యము
వృశ్చికం      విరోధము    3 సంతోషము
ధనుస్సు           8 నష్టము        2 గమనం
మకరం              7 భయము          1 పీడ
కుంభం             6 లాభము         12 హాని 
మీనం               5 కలహము               11 గౌరవము
మొత్తం మీద కర్కాటక సింహ మకర కుంభ రాశుల వారికి రాహు కేతువుల వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
అందులోనూ విశేషంగా మకర రాశివారికి ఎక్కువ ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి ఎందుకనగా మొన్నటి చంద్ర గ్రహణం   కేతు గ్రస్తమై మకర రాశిలో అయినందున.
పరిహారాలు : 
🐍 రాహు మంత్రం  ప్రతి రోజూ 108 సార్లు 48 రోజులు 🐍
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
🐍 కేతువు మంత్రం ప్రతి రోజూ 108 సార్లు 48 రోజులు  🐍
ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || vp
48 రోజులు అయ్యాక రాహువు కోసం కిలోనర మినుములు, కేతువvు కోసం కిలోనర ఉలవలు దానం చేయాలి.
మరింత సమాచారం కోసం వ్యక్తిగతంగా కాల్ చేయగలరు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: