ఈ మిలీనియర్ బెగ్గర్ ఇంట్లో ఉన్న దగ్గరున్న డబ్బు లెక్కెట్టడానికే 8 గంటలు పట్టింది

Sirini Sita
బిచ్చగాళ్లకు పాన్‌కార్డుతోపాటు ఆధార్, సీనియర్ సిటీజన్ కార్డులు కూడా ఉన్నాయి.ఏంటి నమ్మబుద్ది కావడంలేదా......అంతే కాదు ఏకంగా 8.77  లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌లు కూడా ఉన్నాయి.ఒక సాధారణ పేదవాడికి కూడా లేని ఇవన్నీ ఒక  బిక్షాటన చేసే వ్యక్తి ఇంట్లో చూసి నోరెళ్ళబెట్టారు ముంబై పోలీసులు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవారి కంటే.. రోడ్లుపై బిక్షాటన చేసే వ్యక్తుల సంపాదనే మెరుగ్గా ఉంటుందని మరోసారి తేటతెల్లమైంది. ముంబయిలో ఓ బిచ్చగాడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు.

అక్కడ రూ.1.5 లక్షలు నగదుతోపాటు అతడి పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.8.77 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌లు ఉన్నట్లు గుర్తించారు.బిర్భిచంద్ ఆజాద్ (82) అనే వృద్ధుడు గోవండి ప్రాంతంలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఆజాద్ రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు అతన్ని ఢీ కొట్టింది. దీంతో ఆజాద్‌ అక్కడికక్కడే చనిపోయాడు.

పోలీసులు ఆజాద్‌‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోడం కోసం అతడు నివసిస్తున్న గుడిసెకు వెళ్లారు. అక్కడ భారీ సంఖ్యలో ఉన్న చిల్లర చూసి ఆశ్చర్యపోయారు. ఆ మొత్తాన్ని లెక్కించగా రూ.1.5 లక్షలు ఉన్నాయి. వీటిని లెక్కించడానికి పోలీసులకు 8 గంటల సమయం పట్టింది. దీనితోపాటు బ్యాంకులో రూ.8.77 లక్షల ఉన్నట్లు పత్రాలు లభించాయి. రైల్వే పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి.. యాచకుడి వద్ద ఉన్న చిల్లరను, ఫిక్డ్స్ డిపాజిట్ రశీదులను స్వాధీనం చేసుకున్నారు.



బిర్బిచంద్‌ది రాజస్థాన్ అని అతని ఆధార్ కార్డు ద్వారా తెలిసింది.  రాజస్థాన్‌లోని తమ కుటుంబాన్ని వదిలి ముంబయిలో బిక్షాటన చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చాలా సంవత్సరాలుగా ముంబై వీధుల్లో యాచక వృత్తి చేసుకుంటూ గడుపుతున్న ఆజాద్ కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: