ఢిల్లీలో గ‌తం కంటే త‌గ్గిన అగ్నిప్ర‌మాదాలు..!

Paloji Vinay
బాణాసంచాపై నిషేధం ఉన్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో ప్రజలు పటాకులు కాల్చారు. దీంతో గాలికాలుష్యం మ‌రింత పెరిగింది. ఢిల్లీ వాయు నాణ్య‌త‌పై దీపావళి భారీ ప్రభావాన్ని చూపినప్పటికీ, మంచి విషయం ఏమిటంటే, అగ్నిమాపక సేవా విభాగం ద్వారా దేశ రాజధానికి మొత్తం 152 ఫోన్‌ కాల్‌లు వచ్చాయి, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం తక్కువ అని అధికారులు చెబుతున్నారు.


ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ శుక్రవారం మాట్లాడుతూ, "అర్ధరాత్రి తర్వాత  అగ్ని మాపక శాఖ‌కు మరో 36 కాల్‌లు వచ్చాయని, అవన్నీ సాధారణ అగ్నిమాపక కేటగిరీకి చెందినవే. ఈసారి దీపావళికి 152 ఫోన్‌  కాల్‌లు వచ్చాయని, ఇది గత సంవత్సరం కంటే తక్కువ వ‌చ్చాయి. మొత్తం నాలుగు సంఘ‌ట‌న‌లు బాణాసంచాతో అనుసంధానించబడినట్లు అనుమానిస్తున్నారు. దీపావళి రోజున ఎలాంటి తీవ్రమైన అగ్ని ప్రమాదం జరగలేదు. పెద్దగా అగ్నిమాపక కాల్స్ రాలేదు. అని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రజలు తక్కువ స్థాయిలో క్రాకర్లు పేల్చారని ఆయన అన్నారు.

పండుగ వేడుకల నేపథ్యంలో, శుక్రవారం ఉదయం తీవ్ర గాలి కాలుష్యం ఏర్ప‌డింది. దీంతో దేశ‌ రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించింది. మినిస్ట్రీ ఎర్త్ సైన్సెస్ యొక్క SAFAR-ఇండియా అప్లికేషన్ ప్రకారం, నోయిడా యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 'తీవ్రమైన' కేటగిరీకి పడిపోయింది. కాలుష్య మీటర్ ( PM ) 10 యొక్క గాఢత 448 వద్ద ఉంది. ఢిల్లీలో మొత్తంగా, గాలి నాణ్య‌త‌ 2.5 PM సాంద్రతతో 386 వద్ద ఉంది. అలాగే ఈ రోజు ఉద‌యం మ‌ధుర రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత 10 PM కు 430 కి చేరుకుంది. అలాగే ఢిల్లీలో పొగ‌మంచు ద‌ట్టంగా క‌మ్మ‌కోవ‌డంతో చాలామంది ప్ర‌జ‌లు గొంతు, క‌ళ్లు, దుర‌ద సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: