మంచి భ‌ర్త రావాల‌ని ఆ పని చేస్తున్న యువ‌తులు..!

Paloji Vinay
ఆచారాలు, సంప్ర‌దాయాలు, న‌మ్మ‌కాలు ఎక్కువ‌గా భార‌త దేశంలోనే ఉంటాయ‌ని ఎక్కువ మంది విశ్వ‌సిస్తారు. కానీ, అది స‌త్య‌దూరం ఎందుకంటే మ‌న కంటే ఎక్కువ మూఢ‌న‌మ్మ‌కాలు విశ్వ‌సిస్తున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మ‌నం కాస్త బెట‌రే అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ న‌మ్మ‌కాల్లో ఒక‌టి మ‌న‌కు వింతగా అనిపిస్తుంది. మంచి భ‌ర్త కావాలంటే గుండు గీయించుకోవాల‌ట‌.. మ‌రి ఆ వింత ఆచారం ఎక్క‌డుందో తెలుసుకుందాం.


జుట్టు విష‌యంలో ఆడ‌మ‌గ అని తేడా లేకుండా అంద‌రూ శ్ర‌ద్ధ చూపాస్తారు.. అందులో ఆడ‌వారికి జుట్టు ఉంటేనే అందంగా ఉంటారు. త‌మ కురుల‌ను కాపాడుకోవ‌డానికి చాలా ఆసక్తి చూపిస్తారు ఆడ‌వారు. కానీ ఇష్టాల కంటే న‌మ్మకానికి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తారు అక్క‌డ‌. ద‌క్షిణాఫ్రికాకు చెందిన బోరానా తెగ ప్ర‌జ‌లు. ద‌క్షిణాఫ్రికాకు చెందిన కొన్ని తెగ‌ల్లో ఆడ‌వాళ్లు పెళ్లి చేసుకున్న త‌రువాత జుట్టు పెంచ‌డానికి లేదు. వివాహానికి ముందే  త‌మ కురుల‌ను క‌త్తిరించుకోవాలి లేదా గుండు తీసుకోవాలి.

     దక్షిణాఫ్రికాలోని ఇథోపియా, సోమాలియా దేశాల్లో స్థిరపడిన బొరానా తెగ ప్ర‌జ‌లు ఈ వింత ఆచారం పాటిస్తారు. ఈ తెగకు చెందిన వారు 500 మంది ఉంటారు. సాధారణంగా గిరిజన తెగల్లో మాతృస్వామ్య వ్యవస్థ పాటిస్తారు. వారికే నిర్ణయాధికారాలు ఉంటాయి. కానీ బోరానా తెగ మాత్రం దీనికి విరుద్ధంగా  పితృస్వామ్య వ్యవస్థ ఉంది. దీంతో పురుషులదే అన్నింటా ఆధిక్యం క‌న‌బ‌ర్చుతారు.

    ఈ బోరానా తెగలో వింత ఆచారం పాటిస్తారు. మంచి భ‌ర్త రావాలంటే జ‌ట్టు అస్స‌లు ఉండ‌కూడ‌దంటా.. ఎంత‌లా వ‌ద్ద‌న్నా అక్క‌డ విన‌రు జుట్టు మొత్తం తీసి వేస్తారు. అమ్మాయికి పెళ్లి అనే మాట రాగానే గుండు తీసేస్తారు ఆ తెగ‌లో.. ఒక వేళ నామా మాత్రం గా కొంచెం జుట్టు ఉన్నా మంచి భ‌ర్త రాడ‌ని విశ్వ‌సిస్తారు. గుండు తీసుకుంటే మంచి భ‌ర్త వ‌స్తాడ‌ని.. అలాగే అత్తింటి వారు కూడా మంచి వారు దొరుకుతార‌ని బోరానా ప్ర‌జ‌లు న‌మ్ముతారు. దాంతో అక్క‌డ పెళ్లైన ఆడ‌వాళ్లు గుండుతో లేదా పొట్టి జ‌ట్టుతో ఉంటారు. గుండు లేదా చిన్న జుట్టు ఉంటే వారికి పెళ్లి అయిన‌ట్టే.. జుట్టు ఉంటే వారు పెళ్లి కాని వారేన‌ని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: