మంచిమాట: తెలివి అనేది మాటల్లో కాదు చేతల్లో ప్రదర్శించబడుతుంది..!!

Divya
మీర్జాపురాన్ని విజయుడు పాలిస్తూ ఉండేవాడు. అతడు సమర్ధుడైన పాలకుడే కానీ నా కంటే తెలివైన వారెవరైనా ఉంటారా? అని మంత్రి ని తరచూ ప్రశ్నించేవాడు. మంత్రి మొహమాటానికి రాజు కంటే తెలివైన వారు లేరంటూ చెప్పేవారు. ఓ రోజు దర్బారులో మళ్లీ తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. విజయుడిని ఎలాగైనా ఈ అలవాటు నుండి బయటపడేటట్లు చేయాలనుకున్నాడు మంత్రి. మన సరిహద్దుల్లో ఉన్న గోపాలపురంలో చాలా మంది తెలివైన వారు ఉన్నారట మీరు ఆ ఊరివారి కంటే తెలివైన వారిగా తేలిపోతే... మీ గొప్పతనం మరింతమందికి తెలుస్తుంది.
వారెవరు మీ తెలివికి సరితూగరు అన్నాడు మంత్రి.. దాంతో విజయుడు గోపాలపురం బయలుదేరాడు.
ఆ ఊరి పొలిమేర్లలో పశువుల కాపరి కనిపించాడు. రాజు .. నా తెలివితో ముందు వీడిని ఓడిస్తా... అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. నేను మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెబుతావా? అడిగాడు పశువుల కాపరి..దానికి అతడు సరేనన్నాడు.
ఈ సృష్టిలో అన్నింటికంటే వేగవంతమైనది ఏది?
గాలి అని చెప్పాడు పశువుల కాపరి.

అన్నింటికంటే ఉత్తమమైన జలం..గంగా జలం
అన్నింటికంటే ఉత్తమమైన పాన్పు
ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే
భలే భలే నా మనసులోను ఇవే జవాబు లున్నాయి అన్నాడు విజయుడు..ఆ మాటలకు హ హ హ పగలబడి నవ్వాడు. పశువుల కాపరి
ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు విజయుడు తప్పుగా చెప్పిన జవాబుల్ని సరైనవంటుమెచ్చు కుంటేను.. అన్నాడు పశువుల కాపరి.. మరి సరైన జవాబు లేమిటో చెప్తావా సృష్టిలో అన్నింటికంటే వేగవంతమైనది మెదడు ఎడారుల్లో దొరి కేదే ఉత్తమ జలం ఉత్తమమైన పాన్పు అమ్మ ఒడి... చెప్పాడు పశువుల కాపరి.
 ఆ మాటల్లోనీ సత్యం అర్థం చేసుకున్నాడు. విజయుడు పశువుల కాపరే ఇంత తెలివి గా ఉంటే మిగతావాళ్లు ఎంత తెలివిగా ఉంటారో అనిపించింది.  ఊళ్లోకి వెళ్తే ఇంకెన్ని పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నని కోటకి వెనుతిరిగాడు. అప్పట్నుంచి తన తెలివి గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: