మంచిమాట: నిజమైన స్నేహితుడు ఎప్పటికీ మోసం చేయడు..!!

Divya
అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరే...
 వెంకటాపురం అనే గ్రామం ఒకటి.. వెంకటాపురంలో జరిగే వారం సంతకు పక్క పల్లె నుంచి ఇద్దరు వర్తకులు బయలుదేరారు. వారు వర్తకులే కాదు మంచి స్నేహితులు కూడా కొంత దూరం వెళ్ళాక వారకి దారిలో చిన్న గొడ్డలి కనిపించింది. అందులో మొదటి వాడు ముందుకు వెళ్లి ఆ గొడ్డలి తీసి పట్టుకున్నాడు. దీన్ని సంతలో అమ్ముతాను మంచి ధర వస్తుంది. ఈ వారం నాకు ఖర్చులకి సరిపోతుంది అన్నాడు.రెండోవాడికి స్నేహితుడు అలా మాట్లాడటం నచ్చక నేను అమ్ముతాను అంటావేంటి గొడ్డలిని ఇద్దరం చూశాం అది మన ఇద్దరి సొంతం అని చెప్పాడు. మొదటివాడు మిత్రునితో మరేం వాదించలేదు. ఇద్దరు గొడ్డలిని పట్టుకొని ముందుకు సాగారు.

అలా కొంతదూరం వెళ్ళేసరికి కట్టెలు కొట్టు కునే కొందరి మనుషులు ఏదో వస్తువుని వెతుకుతూ ఎదురుగా రావడం గమనించారు. వాళ్లలో ఒకడు గొడ్డలి చేతిలో పట్టుకొని ఎదురుగా వస్తున్న వర్తక మిత్రుల్ని గమనించాడు. మిగిలిన వారికి ఆ విషయం చెప్పి అంతా వర్తకుల వైపు నడిచారు.వాళ్లని దూరంగా చూడగానే గొడ్డలి పట్టుకున్నవాడు మనమేదో ప్రమాదంలో పడ్డట్టున్నాము. అన్నాడు రెండోవాడితో మనమంటావేమిటి? గొడ్డలి చూసింది నువ్వు ఆ ప్రమాదమేదో నీకే నాకు కాదు అని చెప్పి మిత్రుని విడిచి అక్కడనుంచి మెల్లగా జారుకున్నాడు.
ఎదురుగా వచ్చిన వారితో.. ఈ గొడ్డలి మా చేతి నుంచి జారిపోయింది ఇది మాకెంతో అవసరం మొత్తానికి నీకైనా దొరికింది సంతోషం గొడ్డలి కి బదులుగా ఈ డబ్బు తీసుకుని అది మాకు ఇచ్చేయండి. అని చెప్పగానే వ్యాపారి మారుమాటాడకుండా వారు ఇచ్చిన డబ్బు తీసుకొని గొడ్డలి ఇచ్చేశాడు. అతడికి ఆ డబ్బు వల్ల పెద్దగా సంతోషం కలగలేదు. కానీ మిత్రుడి నిజస్వభావం తెలియడం ద్వారా మాత్రం చాలా గొప్ప మేలు జరిగిందనుకున్నాడు.. మిత్రుడంటే సహాయపడాలి గానీ ఇలా తప్పించుకో కూడదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: