మంచిమాట: అంతా కలసి వుంటే ఏ బాధ వుండదు..!!

Divya
ఒకానొక సమయంలో అన్విత, అనీష్ లతో పాటు భార్యను వెంట తీసుకొని సీతారామయ్య ఇందిరాపార్క్ కి వెళ్ళాడు. కొద్దిసేపు బోటింగ్ చేశాక వారు పార్క్ అంత తిరిగి చూస్తుంటే ఒక చోట నేలమీద పడి ఉన్న ఓ పక్షి గూడుని అనీష్ చూశాడు.
"అదేమిటి తాతయ్య?" అని అనీష్ అడిగాడు
"పక్షి గూడు చెట్టు మీద నుంచి కింద పడిపోయినట్టు ఉంది""అందులో పక్షులు ఉన్నాయా?" అని అన్విత అడిగింది"లేవు అది ఖాళీ గూడు" సీతారామయ్య దాని దగ్గరకు వెళ్లి పరీక్షగా చూసి చెప్పాడు. "ఇది గోరింక కట్టుకున్న గూడు""కూల్! దీన్ని మేము అమెరికాకి తీసుకు వెళ్ళవచ్చా?" అని అనీష్ అడిగాడు.
తల ఊపి సీతారామయ్య దాన్ని తీసి తన చేతిలోని సంచిలో వేశాడు."అది ఎందుకు ఖాళీ అయ్యింది ?
అది పిల్లల కోసం కదా గూడుకట్టింది?" అనిష్
అడిగాడు.
అవును.. కానీ పిల్లలు పెద్దయి రెక్కలు వచ్చాక వెళ్ళిపోయాయి.. దానితో ఆ గూడు ఖాళీ అయ్యింది.
మరి పెద్ద పక్షులేమయ్యాయి.అవి ఇంకో గూడు కట్టుకొని వాటిలో మళ్లీ పిల్లల్ని పెడతాయి.
"తాతయ్య !మీ ఇల్లు కూడా కాళీ గూడె కదా?"కొద్ది సేపాగి అని అనీష్ అడిగాడు "ఎందుకని?"
"గోరింక పిల్లలు వెళ్తే ఈ గూడు ఖాళీ అయిపోయినట్టుగా మీ పిల్లలు ఇద్దరూ అమెరికా కి వెళ్లి పోతే మీ గూడు కూడా అయిపోయింది కదా?"
అవును.. మీరు రేపు పెద్దయి కాలేజీకి వెళ్లి ఆ తరువాత ఉద్యోగం వచ్చాక లేదో పెళ్లి అయ్యాకో వెళ్ళిపోతే మీ గూడు కూడా ఖాళీ అవుతుంది.
ఇది లోక సహజం అని సీతారామయ్య చెప్పాడు.
అంత సేపు వారి సంభాషణను మౌనంగా వింటున్న సీతారామయ్య గారి భార్య చెప్పింది.
కాకపోతే మనమంతా ఒక పెద్ద గూటిలోనే కలిసే ఉంటున్నాం. కాబట్టి ఒకరిని మరొకరు మిస్ అవడం లేదు."పెద్ద గూడు ఎక్కడ ఉంది అన్విత?" వెంటనే అడిగింది.ఈ ప్రపంచమే ఆ పెద్ద గూడు మనమంతా దేవుడి పిల్లలం కాబట్టి మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. ఈ గూడుని వదిలి వెళ్ళడం అంటే మరణించడమే అంతదాకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోగళం ఆవిడ చెప్పింది.
"ఓ!"కాకపోతే మనమంతా ఒకే గూడులో ఉన్నాం. అన్న సంగతి తెలుసుకోకుండా ఒకరికొకరం దూరమై పోయాం అనుకొని చాలామంది బాధపడుతుంటారు. ఇది తప్పు కాబట్టి మీరు తిరిగి అమెరికా వెళ్ళిపోయే ముందు మమ్మల్ని వదిలి వెళ్తున్నామని ఏడవకూడదు"అని సీతారామయ్య వారికి చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: