మంచిమాట: మంచి స్నేహం.. మంచి పుస్తకం ఎప్పటికీ మరుపు రావు..!!

Divya
ఒక గ్రామంలో రాము ,సోము అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునే వారు. రాముని తల్లిదండ్రులు బాగా గారాబం చేశారు. అంతేకాదు అవసరం లేకపోయినా ఖరీదైన దుస్తులు, ఆట వస్తువులు కొనిచ్చేవారు. దానికి అలా పెంచడంతో రాముకి బాగా గర్వం పెరిగి తోటి పిల్లలను చులకనగా చూసే వాడు.. తన ఆటవస్తువులు వారితో పంచుకోవలసి వస్తుందని ఒంటరిగా ఆడుకోవడం మొదలు పెట్టాడు. సోము అలా కాక అందరితో కలిసిమెలిసి ఉండే వాడు. తన దగ్గరున్న వాటిని అందరికీ పంచేవాడు. ఒకరోజు రాము కొత్త బంతితో ఆడుకోవడం చూసి" నీ బంతి భలే బాగుంది నేను నీతో ఆడుకోవచ్చా?"అని అడిగాడు.
రాము పో నేను నీతో ఆడుకొను ఇది మా నాన్నగారు నా కోసం ఎంతో ఖరీదు పెట్టి కొన్నారు. నేనొక్కడినే ఆడుకుంటాను అన్నాడు.  తన వస్తువులు, దుస్తులతో మాత్రమే ఉంటూ ఎవరితోటీ స్నేహం చేయలేదు.
కొన్ని సంవత్సరాలు గడిచాయి..రాము ఉన్న గ్రామంలో ఉన్నత పాఠశాల లేదు అందుకని రాముని పట్టణంలోని ఉన్నత పాఠశాల లో చేర్చారు. అక్కడే హాస్టల్ లో ఉంచారు.. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో రాముకి కొత్త వాతావరణంలో ఒంటరితనం మొదలయింది. ఎవరితో స్నేహం చేయటం అలవాటు లేక బాధపడుతూ ఉన్నాడు.
ఇలా ఉండగా ఒకరోజు సోము కనిపించాడు..రాము నీ చూసి విషయం తెలుసుకున్న సోము "ఏడవకు రామూ! నన్ను కూడా మా తల్లిదండ్రులు ఈ బడిలో చేర్చారు మనిద్దరం ఒకే ఊరి నుంచి వచ్చాము. మనిద్దరం ఒకరికోకరు తోడుగా ఉందాం అన్నాడు.
రాముకి ధైర్యం వచ్చింది. సంతోషం కలిగింది. గ్రామంలో ఉన్నప్పుడు తన ప్రవర్తించిన తీరు పట్ల సిగ్గుగా అనిపించింది. ఖరీదైన వస్తువులు తనకు తోడుగా, తృప్తిని ఇవ్వలేవని అందరితో స్నేహంగా ఉండడం, కలవడం చాలా అవసరం అని తెలుసుకున్నాడు. కాబట్టి ఏదీ శాశ్వతం కాదు మనతో స్నేహం చేసిన వారే శాశ్వతం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: