మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

Divya
నాగావళి నదీతీరంలోఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనందమహర్షి.. కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే తన జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆయన ప్రతిరోజు క్రమం తప్పకుండా సాయంత్రం దగ్గర్లోని శివాలయానికి వెళ్లి అక్కడ ఎంతోమంది ప్రజలకు ఉపన్యాసాలిచ్చేవాడు. ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్లులందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు..అలా ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా, నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ శివాలయానికి వచ్చారు.

ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి. 'ఇతడు నదిలో కొట్టుకు పోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం. గురువుగారు అన్నారు వాళ్లు.. అతడు కొంచెం సేపుసేద తీరాక 'నదిలో ఎలా పడిపోయావు నాయనా'అని అడిగారు స్వామీజీ..అప్పుడు ఆ వ్యక్తి  పడిపోలేదు కావాలనే దుకాను. నా జీవితంలో అన్నీ కష్టాలే.. ఏ పని చేసినా నాకు కలిసి రాలేదు. ఆఖరికి భార్య పిల్లలను కూడా పోషించలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు. అంతా విన్న స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు. ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు. అతడు ఆవురావురంటూ ఆ పండును తినేసాడు.

స్వామీజీ ప్రశాంతంగా అతడికేసి చూస్తూ అమ్మ దగ్గర పండంత తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావా ? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ వ్యక్తిమాత్రం ఫక్కున నవ్వి గింజలు తినడానికి పనికి రావు స్వామి? అందుకే ఉమ్మేసాను అన్నాడు.. మరి గింజలు అడ్డు రాగానే తినడం మానేయలేక పోయావా? అంటూ మరో ప్రశ్న వేశారు.. స్వామీజీ.. ఇంత తియ్యగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే? అన్నాడా వ్యక్తి..అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే.. గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే.. కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటారా.. అన్నారు..

దానికా వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడూ ఇలాంటి తెలివితక్కువ పని చేయను.. కాయకష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు.. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: