మంచిమాట: ఆలోచించే శక్తి ఉండాలే కానీ విజయం మనదే అవుతుంది..!!

Divya
అనగనగా కోసల దేశపు యువరాణి అయినటువంటి మయురీ దేవికి యుక్తవయసు వచ్చింది.. అయితే తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు కోసల దేశపు మహారాజు.. కానీ మయూరీ దేవి తన తండ్రిని ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఇక ఆరోజు నుంచి ఆమె మౌనవ్రతం చేపడుతున్నారని తన వ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో అతడినే వివాహం చేసుకుంటానని చెప్పింది.. అయితే యువరాణి మయూరీదేవి మౌన వ్రతాన్ని భంగపరచాలని ఎంతోమంది యువకులు ప్రయత్నించారు.
వారిలో ఎంతోమంది అందగాళ్ళు, వీరులు, శూరులు కూడా ఉన్నారు .. కానీ ఏ ఒక్కరూ కూడా మయూరి దేవి మౌన వ్రతాన్ని చేధించలేకపోయారు. అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఇలా ఎంత మంది వచ్చి పరీక్షించినప్పటికీ తన కూతురు మౌనవ్రతాన్ని ఎవరూ చేయించలేక పోతున్నారు అని, ఇక తన కుమార్తెకు వివాహం చేయలేనేమో అని దిగులు పట్టుకుంది మహారాజుకి . ఒకరోజు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చారు. అతని ముఖం తేజోమయం గా ఉంది..కానీ ధరించిన వస్త్రాలు మాత్రం చాలా బీదవాడు అని తెలుపుతున్నాయి.
అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి.. మహారాజా..! యువరాణి గారు నన్ను కొంతకాలం కిందట వివాహం చేసుకున్నారు.. కానీ నేను ఒక నిరుపేద కావడంతో ఆ విషయం నీకు చెప్పలేక ఆమె ఇలా మౌనవ్రతం పాటిస్తూ కాలం గడుపుతోంది అంటూ అన్నాడు.. అప్పుడు మయూరీదేవి వెంటనే లేచి అంతా అబద్ధం.. ఇతను ఎవరో కూడా నాకు తెలియదు.. అంటూ గట్టిగా అరిచింది.. ఇక అతను చిరునవ్వు నవ్వి నిజమే..! నేనెవరో మీకు తెలియదు.. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుడిని.. మీ మౌనవ్రతం ని భంగం చేయడానికి అబద్ధం చెప్పాను.. అంటూ మారు వేషాన్ని తొలగించాడు.. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు, తన కుమార్తె మయూరీ దేవీ ని ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: