మంచిమాట: అనాలోచితంగా చేసే పని అపాయానికి దారితీస్తుంది..!!

Divya
ఒకానొకప్పుడు మాండవిష అనే పాము పెద్ద పర్వత శ్రేణుల్లో నివసిస్తూ ఉండేది. వయస్సు మీద పడేకొద్దీ దానిలోని శక్తి సన్నగిల్లుతూ వస్తోంది. క్రమంగా ఆహారం వేటాడలేక అది బలహీనమై పోయింది. ఒకరోజు ఆ పాము అమ్మో ఇకపై నేను ఎక్కువ కష్టపడకుండా.. నన్ను నేను పోషించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటూ తనకు తానే అనుకుంది. వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. అది అప్పటి నుంచి ప్రతి రోజు నిండుగా కప్పలు ఉన్నా సరస్సు దగ్గరకు వెళ్లి నిశ్శబ్దంగా మౌనంగా బాధగా మొహం పెడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉండేది.

ఇలా ఉండగా ఒకరోజు ఆపాముని గమనిస్తున్న కప్ప దూరంగా నిలబడి అయ్యా మీరు ఎప్పటిలా ఆహారం కోసం వెతకడం లేదు. అని అడిగింది..మిత్రమా..! నిన్న రాత్రి నేను ప్రమాదవశాత్తు ఒక బ్రాహ్మణ కుమారుని కట్టేశాను. అతడు కాస్త చనిపోయాడు. అతని తండ్రి నేను వేటాడి తినే జంతువులకు సేవ చేసి , అవి పెట్టింది తిని , నా శేష జీవితం అంతా గడపమని శపించాడు. ఆ కారణం చేత మీ జాతికి సేవ చేద్దామని ఇక్కడికి వచ్చాను అని పాము-కప్ప లతో నమ్మకంగా చెప్పింది. ఈ కథ  కప్పల రాజు చెవిన పడింది. తను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి స్వయంగా కప్పలరాజు పాము దగ్గరకు వచ్చాడు. అప్పుడు పాము వాటికి సహాయం చేయడానికే వచ్చినట్టుగా కప్పల రాజు ను కూడా నమ్మించింది.

అప్పుడు కప్ప రాజు చాలా ఉత్సాహంతో పాము వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. అది చూసి మిగిలిన కప్పలన్నీ ఆ కప్ప రాజును అనుసరించాయి. ఆ పాము ఆ కప్పల సావాసం పొందే విషయంలో విజయం సాధించింది. ఆ మరుసటి రోజు పాము కప్పలన్నింటిని తన వీపు మీద కూర్చోబెట్టుకొని అలా నెమ్మదిగా పాకడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని గమనించిన కప్పలరాజు పాముతో ఓ మిత్రమా ఎప్పటిలాగా నువ్వు వేగంగా పాకటం లేదు. దానికి ఆ పాము తెలివిగా నాకు తినడానికి ఏమీ లేదు.. అందువల్ల నేను చాలా బలహీనమయ్యాను.. వేగంగా పాక లేకపోతున్నాను. అని సమాధానమిచ్చింది.
అప్పుడు ఆ కప్పల రాజు నీ తోక చివరన ఉన్న చిన్న కప్పను నువ్వు తిను అని చెప్పింది..దాంతో తన పథకం పారుతున్ననందుకు పాము చాలా సంతోషించింది. వెంటనే తన తోక చివరనున్న చిన్న కప్పను గబుక్కునమని తినేసింది. ఈ విధంగా ప్రతి రోజు కప్పల రాజు పాము వీపు మీద ఎక్కిన తరువాత అది వేగంగా పాక లేకపోవడం వల్ల నీతోక చివరనున్న చిన్న కప్పను నువ్వు తిను అని దానితో చెప్పేది. అది వెంటనే గబుక్కున తినేసేది ఇలా చాలా రోజులు ఇదే పద్ధతి కొనసాగింది..ఆ పాము కప్పల రాజును మినహా మిగతా కప్పల న్నింటినీ తినేసింది. ఆ మరుసటి రోజు పాము వీపుమీద ప్రయాణం అయిన తర్వాత ఆ కప్పల రాజు ఎప్పటిలాగే నీ తోక చివరనున్న చిన్న కప్ప నువ్వు తిను అని అంది అప్పుడు ఆ పాము గిరుక్కున తిరిగి ఆ కప్పల రాజును గుటుక్కున మింగేస్తుంది. ఇలా మోసగాడైన తన శత్రువును నమ్మి ఆ కప్పలన్నీ తమ మరణాన్ని తామే కొని తెచ్చుకున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: