మంచిమాట: తెలివి ఉంటే సాధించలేనిది ఏమీ లేదు..!!

Divya
అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సింహం నివస్తుండేది. ప్రతిరోజు అది ఆకలి తీర్చుకోవడానికి అడవిలోని జంతువులన్నింటిని చంపి తింటూ ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకు వచ్చాయి. జంతువులన్నీ అలా కలిసి కట్టుగా రావడం చూసి సింహం సంతోషంగా నాకు ఈ రోజు వేటకు కష్టపడాల్సిన అవసరం లేదు. అని అనుకుంది. అప్పుడు జంతువులు మహారాజా మీరే అడవికి రాజు.. మేమంతా మీ ప్రజలము.. మీరు ఇలా చంపుకుంటూ పోతే మీరు పరిపాలించడానికి ఎవరు ఉండరు. మీరు మీ నివాసంలోనే ఉంటే రోజు ఒక జంతువు వచ్చి తానే మీకు ఆహారం అవుతుంది.అని ఆ జంతువుల్లో ఒకటి సింహంతో వినయంగా చెప్పింది.

ఆ ఏర్పాటుకు సింహం చాలా సంతోషంగా ఒప్పుకొని మీరేరోజైనా నాకు అనుకున్నట్లు ఆహారం పంపడం విఫలమైతే ఆరోజు మిమ్మల్నందర్నీ చంపేస్తాను. జాగ్రత్త దాంతో ప్రతిరోజు సింహానికి ఆహారంగా ఒక జంతువు వెళ్తూనే ఉంది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ చిట్టి కుందేలు ఈ సింహం నుండి తనను తాను రక్షించుకోవటమే కాకుండా ఇతర జంతువులను కూడా రక్షించాలని ఒక ఉపాయం ఆలోచించింది. చిట్టి కుందేలు నెమ్మదిగా సింహన్ని సమీపించింది. అంత చిన్న కుందేలుని చూసిన సింహం కోపంతో ఏంటి నా ఆహారానికి ఇంత చిన్న జంతువా తక్షణమే అన్ని జంతువులను చంపేస్తాను. అని పెద్దగా గర్జించింది. అప్పుడు చిట్టి కుందేలు ఆ సింహగర్జనకు భయపడి వణుకుతూ రాజా..మేము ఆరుగురం ఆహారంగా పంపారు .. ఒక పెద్ద సింహం మాలో ఐదుగురిని చంపి తినేసింది అని అంది.
దాంతో సింహం కోపంగా గర్జించి ఏంటి ఇంకో పెద్ద సింహమా వెంటనే దాని దగ్గరకు తీసుకెళ్ళు. అని అంది సింహం.. అప్పుడు చిట్టి కుందేలు సింహాన్ని కాస్త దూరం తీసుకెళ్ళి దాన్ని ఒక బావి దగ్గర ఆపింది అప్పుడు వెంటనే కోపంతో శత్రువుని చంపాలని బావిలోకి గబుక్కున దూకింది. దాంతో తెలివి తక్కువ సింహం తన చావుని తనే కోరి తెచ్చుకుంది.తెలివైన చిట్టి కుందేలు పరుగు పరుగున వెళ్లి వెంటనే ఈ మంచి వార్తని అడవిలోని మిగిలిన జంతువులకు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: