మంచిమాట: సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరూ అవసరం అవుతారు..!

Divya
ఒకానొక సారి సింగవరానికి వెళ్లే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకునే వారు. ఓరోజు చెట్టులో అంతర్ భాగాలైన వేర్లు.. ఆకులు..పండ్లు అన్నీ నేను గొప్ప అంటే.. కాదు నేనే గొప్ప అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరచి కొన్ని రోజులు ఆగండి.. మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను..అని చెప్పింది.
ఒకరోజు ఆ దారి వెంటవెళ్తున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టెక్కి పండు కోసుకుని తిని కాస్త తేరుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు బాటసారిని నాలో నీకు ఏ భాగం ఇష్టం అని అడిగింది. అప్పుడు బాటసారి... నా ఆకలి తీర్చిన నీ మధురఫలాలు ఇష్టం. అని చెప్పి తనదారిన తాను వెళ్లిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకు వచ్చి అక్కడ తవ్వి. వేర్లను మూట కట్టుకున్నాడు. ఆ చెట్టు వైద్యుణ్ని 'నాలో నీకు ఇష్టమైనది ఏంటి'అని ప్రశ్నించింది..అప్పుడు ఆ బాటసారి  నీ వేర్ల ద్వారా ఎంతో మంది రోగులకు వైద్యం చేస్తున్న... కాబట్టి అవంటేనే నాకు ఇష్టం. అనేసి వెళ్ళాడు.
మరి కొన్నాళ్ళకు ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కింద కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత తన దారిన తాను వెళ్తుండగా... నాలో నీకు ఏ భాగం ఇష్టం. అని చెట్టు అడిగింది. ఎండ నుంచి నాకు ఉపశమనాన్ని కలిగించిన ఈ ఆకులు, కొమ్మలంటే ఇష్టం. కానీ వేర్లతోనే చెట్టుకు నీరందుతుంది. ఆకులూ కొమ్మలూ ఉంటేనే బాటసారులకు నీడనీవ్వగలవు. ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏ భాగాలూ వేటికి తీసిపోవు. అన్ని సమన్వయంతో పని చేస్తేనే చెట్టు మనగలుగుతుంది. నీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. అని చెప్పి వెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: