మంచిమాట: విజయం పొందాలి అంటే సహాయం కూడా చేయాలి..!

Divya

విధేయుడు, అజేయుడు అనే యువ రాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువు గారి వద్ద విద్యాభ్యాసం పూర్తిచేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపే లోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు. గురువు గారు ఇద్దరినీ పిలిపించి....' నాయనా. మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారికి సంభందించిన గుహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో..? వారే ఈ పరీక్షలో విజేత'అని చెప్పారు.

దాంతో యువరాజులు ఇద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజేయుడు  మాత్రం ఆగి, అతడికి సపర్యలు చేసి, ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమిత పడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజేయుడు మళ్లీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీ గా కనిపించాడు.
వెంటనే విజేయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడినీ విడిపించాడు. అంతే కాదు... వారు విజేయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమయిందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజేయుడు... దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ల ద్వారానే మరకతమణి కూడా సంపాదించాను. అని చెప్పాడు. పక్కవారికి సహాయం చేస్తే అది మనకు మంచిదన్న విషయం అప్పుడే అజేయుడుకి అర్థమయింది.

అజేయుడు , విజేయుడు మాత్రమే కాదు.. ఎవరైనా సరే ఎదుటి వాళ్లు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్లకు కొద్దిగా అయినా మానవతావాదం తో సహాయం చేయాలి. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికి ఎరుక అన్నట్టుగా.. ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి సమాచారం అందుతుందో తెలియదు కదా.. వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి చేతనైతే సహాయం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: