మంచిమాట: నీది కానిది ఎప్పుడు నీ చెంత చేరదు..!

Divya
ఒక పిసినారి కోమటి తన డబ్బు సంచిని పోగొట్టుకున్నాడు. అందులో ఒక వంద బంగారు నాణేలు ఉన్నాయి. అది పోయిన నాటినుండి ఏమి చేయలేక మతి లేనట్లుగా, పిచ్చెక్కినట్లు గాను ఉంటోంది అతనికి. చివరికి తన ఊరి పెద్ద మనిషి దగ్గరకు వెళ్లి తన కష్టం గురించి మొర పెట్టుకున్నాడు."నీవు ఆ సంచి తెచ్చి ఇచ్చిన వారికి 50 నాణేలను ఇస్తానని బహుమతిగా ప్రకటించు"అని ఆయన సలహా ఇచ్చాడు.
అయ్యో 50 నాణెలను ఇచ్చే వేయడమే అని బాధపడ్డాడు. కానీ ఇంకా ఏమీ తోచక ఆ విధంగానే ప్రకటించాడు ఆ వ్యక్తి. ఒక బక్క రైతుకు ఆ సంచి దొరికింది. బహుమతి దొరికిందనే సంతోషంతో అతడు ఆ కోమటి ఇంటికి వెళ్ళాడు. ఆ పిసినారి కోమటి తన సంచి కనిపించగానే సంతోషంతో పొంగిపోయాడు."నీవు ఎంత మంచి వాడవు..మీకు అనేక ధన్యవాదాలు"అని చెప్పి ఆ కోమటి ఇంటి లోనికి పోయి తలుపు మూసేశాడు.
కానీ రైతు ఇంటి లోకి వెళ్లిన కోమటి  ఆ యాభై నాణేలను  తెచ్చి ఇస్తాడు అని అక్కడే ఉండిపోయాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి రైతు వెళ్లి తలుపు కొట్టి శెట్టిగారు.. శెట్టి గారు.. అని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నారు నీకేం కావాలి అని అడిగాడు ఆ కోమటి. ఆ మాటలకు తెల్లబోయాడు రైతు.. సంచి తెచ్చిస్తే 50 నాణేలను  బహుమతిగా ఇస్తామన్నారు కదా. వాటిని ఇప్పించండి వెళ్ళిపోతాను అని అన్నాడు.
నీకు బహుమతా..?నేను లోపలికి వెళ్ళి లెక్కించుకుంటే అందులో వంద నాణేలు మాత్రమే ఉన్నాయి. అందులో 150 ఉండాలి.. అంటే నువ్వు బహుమతిగా తీసుకున్నట్లేగదా? నన్ను అనవసరంగా బాధ పెట్టకు వెళ్ళిపో అన్నాడు ఆ శెట్టి. ఏమి చేయలేక రైతు వెళ్లి తన గోడును ఆ ఊరి పెద్ద మనిషికి తెలియజేశాడు. ఆ శెట్టి కి డబ్బు సంచి ని తీసుకు రావాల్సిందిగా ఆయన కబురంపాడు. అతడు వచ్చిన తరువాత ఈ విషయంలో నీవు చెప్పేది ఏమైనా ఉందా అని ఆయన శెట్టిని అడిగితే ఆ శెట్టి సంఖ్య 150 నాణాలు ఉండాలి.. కానీ ఇప్పుడు 100 మాత్రమే ఉన్నాయని చెప్పాడు.
ఈ సంచి చిన్నది.. దీంట్లో 50 నాణేల కంటే ఎక్కువ పట్టవు. నీవు వంద నాణేలను లెక్క పెట్టాను అన్నావు. అందుచేత ఈ సంచి నీది కాదని నా నమ్మకం. ఈ రైతుతో నీవే ఆ సంచికి నిజమైన అధికారివని తలచి పొరపాటున దీని నీకు ఇచ్చాడు. దాని అసలు యజమాని ఎక్కడ లేనందున ,ఈ సంచిని ఈ బీద రైతుకు ఇస్తున్నాను. అని డబ్బు తో సహా సంచిని రైతుకు ఇచ్చేశాడు ఆ గ్రామ పెద్ద. అక్కడున్న వారంతా ఈ పిసినారి శాస్త్రి కి తగ్గట్టు గానే జరిగిందని అందరూ ఆనందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: