మంచి మాట: గొర్రెల వలె గుడ్డిగా ఇతరులను నమ్మకూడదు ..!
అందులో ఒకనాడు గురువు గారికి శిష్యులు చేసిన పనికి వారిపై కోపం వచ్చి , ఎక్కడికైనా పోయి చావండిరా..! అని కసురుకున్నాడు. శిష్యులు చేసేది ఏమీ లేక ఆ ఊరి చివరకు పోయారు. చెరువులో నీరు తాగి దాహం తీర్చుకుని తమ కర్తవ్యం గురించి ఆలోచించ సాగారు.
ఇంతలో ఒక తుంటరి.. ఏంటి పంతుళ్లు..? ఇక్కడ ఉన్నారు.? ఈ విషయం మీకు తెలియదా..? రామయ్య దయ్యమై ఊరి పొలిమేరల్లో తిరుగుతున్నాడట.! ఇక్కడకు రాకండి ..పారిపోండి.. అని భయపెట్టాడు.
ఆ మాటలు విన్న వెంటనే శిష్యుల ముఖాల మీద నెత్తురు చుక్క లేదు. భయంతో అటు ఇటు పరిగెత్తి మరల అక్కడికే వచ్చి, ఒరేయ్..! మనం ఎందుకు పరుగెత్తుతున్నాము రా..! అని ఆలోచించుకొని కొంతసేపటికి మరల బెంబేలు పడుతూ.. జ్ఞాపకం వచ్చింది. రామయ్య దయ్యమై మనల్ని పట్టి బాధించడం తథ్యము అనుకొని తలోదారి పారిపోయారు.
అలా వారు పోయి పోయి పరమానంద పురానికి చేరుకున్నారు. అక్కడ మదూకర వృత్తి ని చేపట్టి దిక్కులేని పక్షులలా జీవించసాగారు. గురువు గారి కింతలో మరలా శిష్యుల పై ధ్యాస మళ్ళింది. వెర్రి కుంకలు ఎక్కడున్నారో..? ఏం చేస్తున్నారో..? అని బెంగ పెట్టుకొని వెతకడం ఆరంభించారు. కొంతకాలానికి శిష్యుల జాడ తెలిసింది. ఆశ్రమానికి రమ్మని గురువు, శిష్యులకు కబురు పెట్టాడు. కానీ వారు రామయ్య ఊరి పొలిమేరల్లో దయ్యమై తిరుగుతున్నాడు. మమ్మల్ని చంపేస్తాడు. మేము రాము అని బదులు పంపారు.
గురువు గారు శిష్యులను సమాధాన పరిచి , వెనక్కి పిలిపించారు. గురువు గారు పంపిన వ్యక్తి తో శిష్యులందరూ తిరిగి వచ్చి బుద్ధిగానే ఉంటా మండి మమ్మల్ని కసురుకోకండి. మేమంతా మీ శిష్యుల మేగా అంటూ గురువు గారి వద్దనే ఉండిపోసాగారు.. కాబట్టి ఎవరో ఒకరు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి భవిష్యత్తును కూడా నాశనం చేసుకోకుండా ఒకసారి ఆరా తీయడం చాలా మంచిది అని ఈ కథ సారాంశం..