మంచిమాట: పూర్వీకుల నుంచి నేర్చుకోవాల్సిన ఆరోగ్య సూక్తులు ఏంటో తెలుసా..?
1.ఇటీవల కాలంలో చాలా మంది రాత్రి పొద్దుపోయేవరకు మేల్కొని ,ఉదయం 9 ,10 గంటలకు నిద్రలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే ప్రతి ఒక్కరు బ్రహ్మముహూర్తం కంటే ముందుగానే నిద్ర మేల్కోవాలి.
2. ఉదయం, సాయంత్రం నందు రెండు పూటలా స్నానమాచరించాలి.
3. మల విసర్జన చేసిన ప్రతిసారి మలమూత్ర మార్గములను , చేతులు, కాళ్ళను శుభ్రం చేసుకోవాలి.
4. వారంలో రెండు నుంచి మూడు సార్లు తలకు ,ముక్కు, పాదములకు నూనె మర్దనా చేయాలి.
5. బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఉత్తమం. ఇక అంతే కాదు ప్రతి రోజు ఇంటి ముందు ఆవుపేడతో కల్లాపు జల్లి, బియ్యం పిండి తో ముగ్గు వేయాలి. ఆవు పేడలో ఉండే యాంటీ బయోటిక్స్ బయట నుంచి వచ్చే ఇతర వైరస్ లను అడ్డుకుంటుంది. ఇక బియ్యం పిండి ఇంట్లోకి చీమలు రాకుండా చేస్తుంది.
6. జుట్టు ,గోర్లు ,గడ్డము ప్రతి 15 రోజులకు మూడు సార్లు కత్తిరించుకోవాలి.
7. ప్రతి రోజు భోజనం చేసే ముందు పితృదేవతలకు పిండ దానం చేయాలి.
8. భయమూ లేకుండా ధైర్యవంతులుగా ఉండవలెను. ఒకవేళ భయపడినచో వ్యాధులు మనలను హరిస్తాయి.
9. అన్ని రకాల రుచులు అనగా పులుపు, తీపి, చేదు, కారం, వగరు, ఉప్పు వంటి రుచులను ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల వాత , పిత్త, కఫ దోషాలను తగ్గించుకోవచ్చు.
10. రాత్రి కానీ పగలు కాని భోజనం చేయకుండా పస్తులు ఉండడం ఆయుక్షీణం.
11. పాలు, నెయ్యి తృప్తిగా తినడం వల్ల త్వరగా వృద్ధాప్యం దరిచేరదు.
12. మనం తయారు చేసే భోజనం మట్టికుండలో చేయడంవల్ల ఆరోగ్యకరంగా ఉండవచ్చు.
13. అరిటాకులో భోజనం చెయ్యడం వల్ల ఆయుక్షేమం.
14. ప్రతిరోజు నాలుగు పూటలా ఒక కప్పు పెరుగులో నాలుగోవంతు నీళ్ళు కలిపి మజ్జిగ చేసుకొని తాగడం వల్ల అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు.