మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.

Divya

సాధారణంగా ఇటీవల కాలంలో చాలా మంది ఇవన్నీ పాటించడం లేదు కానీ.. పూర్వకాలంలో మాత్రం తప్పనిసరిగా ఈ వాక్యాన్ని ఆచితూచి పాటించే వాళ్లు. ఇది మన భారతదేశ సంప్రదాయం ప్రకారం భర్త కి భార్య ఎప్పుడూ ఎడమవైపున మాత్రమే ఉండాలి అన్నది నిజం. ఇక దానధర్మాలు చేయాలి అన్నా, పూజలు, నోములు ,వ్రతాలు వంటివి చేసేటప్పుడు కూడా భర్త ఎడమవైపున మాత్రమే భార్య ఉండి , ఇలాంటి కార్యాలు చేయాలి అప్పుడే ఫలితం దక్కుతుంది అని మన పండితులు కూడా చెప్పేవారు. అయితే అది ఎలా అన్నారు ? ఎందుకు అలా అన్నారు ? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని రూపొందించేటప్పుడు, తనలోని కుడి భాగాన్ని పురుషుడిగా గాను, తనలోని ఎడమ భాగాన్ని స్త్రీ గా తీసుకొని , ఆడ మగలను  సృష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు శ్రీ మహా విష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎడమ స్థానంలో పదిలంగా భద్రపరిచాడు. ఇక అర్ధనారీశ్వరుడు అయిన శివుడు కూడా ఎడమ భాగంలోనే పార్వతీ దేవిని ఉంచారు. కాబట్టి ఆయనను అర్ధనారీశ్వరుడు అని అంటారు.

ఇప్పటివరకు కూడా మనం సందర్శించిన ఎన్నో దేవాలయాల్లో భర్తకు భార్య ఎడమ వైపు మాత్రమే ఉండడం గమనించి ఉంటాము. ఇక ముఖ్యంగా సీతారాముల విగ్రహాలు చూసినప్పుడు కూడా రాముడు ఎడమ వైపు మాత్రమే సీత ఉండటం చూసి ఉంటాము. ఇక మహాదేవ దేవతలు కూడా తమ భార్యలను ఎడమ వైపు మాత్రమే ఉంచుకున్నారు. కాబట్టి నిజ జీవితంలో మనం కూడా భార్యను భర్తకు ఎడమవైపు ఉండే లాగా చూసుకోవాలి. అంతేకాదు నిద్రపోయే సమయంలో కూడా భర్తకు ఎడమవైపున భార్య ఉండడం వల్ల భర్త తన కుడి చేతిని భార్యపై వేసి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. ఇక అంతే కాకుండా అప్పుడే ఆమె కూడా ఆనందమైన భద్రత శాంతిని పొంది, సుఖంగా నిద్ర పోతుంది. భర్తకు మించిన రక్షణ మరొకటి లేదు అని దీని అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: