మంచిమాట : పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు..

Divya

నిజమే..!  ఏదైనా సాధించాలి అంటే, ముఖ్యంగా మనకు పట్టుదల ఉండాలి. పట్టుదల లేకుండా ఏ పని చేసినా అది వృధా అయిపోతుంది. అయితే దీనిని ఉదాహరణగా చేసుకొని నేను మీకు ఒక చిన్న కథను వినిపిస్తాను.. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అందరికీ తెలిసిందే. కాకపోతే మరొకసారి మీలో చైతన్యవంతం నింపడం కోసం నేను మీకు వినిపిస్తాను..దానిని చూసి మీరు కూడా మారుతారు అన్న ఒక చిన్న ప్రయత్నం అంతే.. పదండి.. ఆ కథ ఏమిటో మీరు కూడా తెలుసుకోండి..

ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇందులో చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో మరొక రోజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొద్దీ వారు బాగా పోరాడారు. ఎత్తులకు పైఎత్తులు వేసి, ఎదుటి వాళ్లను చిత్తు చేయాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు. కానీ పాపం.. చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు బాగా అలసిపోయాడు. ఇక ఒంటి నిండా గాయాలతో , దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. ఇక తాను నెగ్గడు అని తెలిసి, ఆ రాజు మెల్లగా పారిపోయి, దగ్గర్లోని ఒక గుహలో దాక్కున్నాడు.

అక్కడ  అతనికి ఒక సాలీడు కనిపించింది. అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ అది క్రిందకు పడిపోతుంది. మరలా ప్రయత్నించింది, మరలా పడిపోయింది. ఇలా అనేక సార్లు అది క్రింద పడిపోయింది. అయినా అది తన ప్రయత్నం ఆపకుండా చివరికి తన గూటికి చేరుకుంది.
ఇక దీనిని చూసిన రాజుకు దాన్ని పట్టుదల చూసి జ్ఞానోదయం అయింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక అనుకున్నదే తడువుగా,ఈసారి తప్పక శత్రువుని ఓడించాలని గట్టిగా నిర్ణయించుకొని, ఆ పెద్ద సైన్యం ఉన్న రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు..
ఇక తమ సైనికులకు కావలసినంత శిక్షణ ఇచ్చి, వారిని యుద్ధం చేయమని చెప్పాడు. ఇక ఆ సైనికులు కూడా సులభంగా శత్రువును మట్టికరిపించారు. పెద్ద సైన్యం గల రాజు ఓడిపోయాడు. చివరికి చిన్న రాజు విజేత అయ్యాడు.. కాబట్టి విజయం పొందాలి అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడే పట్టుదలతో చేసే ఏ పని లోనైనా సరే విజయం మీదే అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: