మంచి మాట: అ నుంచి అం అః వరకు గల జీవిత సత్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..?

Divya

మనం చిన్నప్పుడు చదువు మొదలు పెట్టింది అ నుంచి.. అలాంటి ఆ స్కూల్లో మన కు  అ అంటే అమ్మ అని చెప్పేవారు.. అయితే ఇందులో అచ్చులు అ నుంచి అః వరకు ఉంటాయని అందరికీ తెలుసు. ఇక ముఖ్యంగా తెలుగు నేర్చుకోవాలన్న , రాయాలన్న మనకు కంపల్సరిగా ఈ అచ్చులు ,హల్లులు తెలిసి తీరాల్సిందే.. ముఖ్యంగా ఈ అచ్చులు అ నుంచి అః వరకు గల జీవిత సత్యాలు ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం..
అ అంటే : నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా " అన్వేషించడం" మొదలు పెట్టు అని అర్థం.
ఆ అంటే : నీలో ఉండే "ఆత్మవిశ్వాసానికి " పదును పెట్టు అని అర్థం..
ఇ అంటే : ప్రతి ఒక్కరిని "ఇష్టపడడం" నేర్చుకో అని అర్థం.
ఈ అంటే : ఇతరులను చూసి " ఈర్ష్య పడటం" మానుకో అని అర్థం.
ఉ అంటే: "ఉన్నతంగా" ఆలోచించు అని అర్థం. ప్రతి ఒక్కరి విషయంలో ఉన్నతంగా ఆలోచించినప్పుడు , నలుగురిలో నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది.
ఊ అంటే :" ఊహకు " అందేలా ఆచరించు అని అర్థం.
ఋ అంటే  : ఋతువులు లాగా జీవితాన్ని అనుసరించు అని అర్థం.
ఎ అంటే : నువ్వు "ఎదగడం"  కోసం మరొకరి  నాశనం చేయకు అని అర్థం..
ఏ అంటే: ముఖ్యంగా "ఏకాగ్రతను "అస్సలు అనుకోవద్దు.. ఏకాగ్రత ఉంటేనే ఏ విషయంలోనైనా ముందడుగు వేయగలరు..
ఐ అంటే : "ఐకమత్యాన్ని"  సాధించడం మర్చిపోకు అని అర్థం.
ఒ అంటే: "ఒంటరితనం" నేర్పిన పాఠాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకో అని అర్థం.
ఓ అంటే :" ఓటమి" నేర్పిన పాఠాలను కూడా జీవితంలో గుర్తుంచుకోవాలి అని అర్థం..
ఔ అంటే :" ఔన్యత్వానికి " పునాదులు వేయడం మర్చిపోకు అని అర్థం.
అం అంటే : అందని ఎత్తుకు ఎదగాలి అంటే,
అః అంటే: అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది..

చూశారు కదా.. అ నుంచి అం అః వరకు చెప్పిన జీవిత సత్యాలు ఏమిటో.. ప్రతి ఒక్కటి లో ఒకరిని కూడా అర్థం దాగి ఉంటుంది దాని విలువ తెలిసిన అప్పుడే అన్నిటిలోను విజయం సాధించవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: