మంచి మాట: అన్ని రోగాలకు కారణమూ మనస్సే..విరుగుడు మనస్సే..

Divya

ఇటీవల కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే, మనం శరీరం అనేక రోగాల బారిన పడడానికి కారణం. మనం తీసుకునే ఆహారంలో లోపమని మనం గుడ్డిగా నమ్ముతున్నాము. కానీ కమనం జీవించే విధానం లోనే ఉంది అని తేల్చిచెప్పారు జపాన్ శాస్త్రవేత్తలు. మనసు ఎప్పుడైతే హాయిగా ఉంటుందో అప్పుడు ఎలాంటి రోగాలు మన దరిచేరవని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు..
అంతే కాకుండా అమెరికాలో కూడా  ఓ పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో ఎవరైతే ఎక్కువ మనశ్శాంతి గా ఉన్నారో వారు ఎక్కువ కాలం జీవించినట్లు గా గుర్తించారు.. కాబట్టి ఇకపై మనం కూడా ఎక్కువకాలం జీవించాలని అనుకుంటే, మన  మనసు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.. ఇందులో భాగంగానే జపాన్ శాస్త్రవేత్తలు అలాగే అమెరికా శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా మన కోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. ఇందులో కూడా మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే అంశాలపై చర్చించారు ..అవేంటో ఇప్పుడు చూద్దాం..

మనసు కలత చెందితే లేనిపోని ఆలోచనలు వచ్చి ,వాటినుంచి బయటపడలేక బలహీనులు అయిపోవడం, అలాగే చెడు అలవాట్లకు బానిస అవడం వంటివి జరుగుతున్నాయట. ఇక ఇటీవల కాలంలో డాక్టర్లు రోగులకు మందులు ఇవ్వడం బదులు ,జీవనశైలిని సరిదిద్దే పనిలో ఉన్నారు. ఇక అందుకే డయాబెటిస్, బీపీ సమస్య ఉన్న వారికి దీర్ఘకాలికంగా ఇచ్చే మందులను తగ్గించి , వారి ట్రీట్మెంట్ ను కూడా మార్చుకున్నారు.
ఇదివరకు ఫలానా ఆహార పదార్థాలను తినకూడదు అని సూచించిన డాక్టర్లు, నిరభ్యంతరంగా అన్ని ఆహార పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవచ్చని వారు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు.. ఇక ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే వారు మంచి మూడు ను క్రియేట్ చేసుకోవాలని, నచ్చిన పాటలను వినమని కూడా వారు సూచిస్తున్నారు.

ఇక అంతే కాకుండా మీరు ఏం చేస్తే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారో,  అదే చేయమని చెబుతున్నారు.. అయితే మంచి మార్గంలో చేసుకుంటూ పోతూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: