మంచిమాట : ఐకమత్యమే మహాబలం..!

Divya

ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో, ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకు వస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..ఐకమత్యమే మహాబలం..!
దీని అర్థం ఏమిటంటే.. కలిసి ఉంటేనే కలదు సుఖం.. ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాం.  సుఖం లో నైనా కష్టం లో నైనా కలసి మెలసి జీవించాలి. అప్పుడే సుఖసంతోషాలు తులు తూగుతాయి.. జీవితంలో ప్రతి ఒక్కరూ కలిసే ఉండాలి. అలా లేని నాడు ప్రతి చిన్న సమస్య ఒక పెద్ద సమస్య లాగా కనిపిస్తుంది. మనిషికి మనిషి ఎప్పుడైతే తోడు అవుతాడో, అప్పుడు ఎంత పెద్ద కష్టమైన చిన్నదిగా కనిపిస్తుంది.. అని దీని అర్థం..
ఉదాహరణకు అందరికీ తెలిసిన కథే, నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను.. మనం చిన్నప్పుడు ఐకమత్యమే మహాబలం అనే ఒక పాఠాన్ని పుస్తకాలలో చదువుకునే ఉంటాము. అదేమిటంటే.. నాలుగు ఎద్దులు ఎప్పుడూ కలిసి మెలిసి ఆహారం కోసం వెతుకుతూ, ఆహారాన్ని తింటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి.. ఒకరోజు బాగా దృఢంగా ఉన్న ఎద్దులను తినడానికి సింహం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండేది. ఎప్పటికైనా ఒంటరిగా దొరకకపోవా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది ఆ సింహం.. ఒక రోజు ఏదో చిన్న గొడవ జరిగి ఎద్దులు విడివిడిగా మేతను వెతుక్కుంటూ వెళ్తాయి. ఇక అనుకున్నదే అవకాశంగా తీసుకున్న సింహం ఒక్కసారిగా ఎద్దు పై దాడి చేస్తుంది. ఇక దాడి కి గురి అయిన ఎద్దు ఒక్కసారిగా అరవడంతో మిగిలిన ఎద్దులన్ని అక్కడికి వచ్చి సింహాన్ని చంపేస్తాయి. కాబట్టి ఎంత గొడవలు వచ్చినా సరే ఐకమత్యంగా ఉండాలి అన్నది ఈ పాఠం యొక్క సారాంశం.. జీవించినంత కాలం ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. మన వెంట ఏది రాదు కేవలం బంధం, బంధుత్వాలు తప్ప..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: